Moviesమళ్ళీ రెచ్చిపోయిన అనసూయ.. విజయ్ దేవరకొండ పై సంచలన కామెంట్స్..అంత మాట...

మళ్ళీ రెచ్చిపోయిన అనసూయ.. విజయ్ దేవరకొండ పై సంచలన కామెంట్స్..అంత మాట అనేసింది ఎంట్రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనసూయ ఎలాంటి పోస్టులు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాంట్రవర్షియల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ.. అనసూయ పరోక్షకంగా పెట్టే పోస్ట్లు అభిమానులకి మండిస్తున్నాయి . మరి ముఖ్యంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేస్తూ రీసెంట్గా ఓ పోస్ట్ పెట్టింది అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇదివరకే విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య వార్ జరిగిన విషయం తెలిసిందే.

లైగర్ సినిమా ఫ్లాప్ విషయంలో అనసూయ పరోక్షకంగా సెలబ్రేట్ చేసుకుందని.. కర్మ బూమరాంగ్ అవుతుంది అని.. పాపం అనుభవించాల్సిందే అన్న కోణంగా అనసూయ పరోక్షకంగా ట్వీట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ కోసమే ఈ ట్వీట్ చేసింది అంటూ అప్పట్లో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు . కాగా ఇదే క్రమంలో రీసెంట్గా విజయ్ దేవరకొండ పై మరోసారి పరోక్షకంగా ట్వీట్ చేసింది అనసూయ . ఇదే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రీసెంట్గా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా “ఖుషి”. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది. రీసెంట్గా దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోని విజయ్ దేవరకొండ పేరు “ది విజయ్ దేవరకొండ” అంటూ మెన్షన్ చేశారు . అయితే అనసూయ తన ట్విట్టర్ ఖాతాలో..” అమ్మ బాబోయ్ ” దీ నా..? ఏం పైత్యం రా బాబు “అంటూ ట్వీట్ చేసింది .

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ను డీ గ్రేడ్ చేస్తూ చేసింది అంటూ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు . నీకు అవసరం లేని విషయంలో తల దురచడం ఎందుకు అనసూయ ..?అంటూ మండిపడుతున్నారు . మరి కొంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మరోసారి ఆమెపై ఫుల్ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు . అనసూయ – విజయ్ దేవరకొండ మధ్య ఉన్నవార్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news