Movies"మహానటి" సినిమాని చేతుల్లారా మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఎవరో తెలుసా..? బ్యాడ్...

“మహానటి” సినిమాని చేతుల్లారా మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఎవరో తెలుసా..? బ్యాడ్ లక్ అంటే ఇదేగా..!!

మహానటి ఈ పేరు వినగానే అందరికి టక్కున గుర్తు వచ్చేది అలనాటి అందాల ముద్దుగుమ్మ మహానటి సావిత్రి . తన అందంతో.. తన నటనతో.. తన అభినయంతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పే కొద్ది ఇంకా చెప్పాలి అనిపిస్తుంది ..వినే కొద్ది ఇంకా వినాలి అనిపిస్తుంది.. అంతలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ చెరగని స్థాయిని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది సావిత్రి.

కాగా సావిత్రి జీవిత చరిత్ర గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించాడు . ఈ సినిమా ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా ద్వారానే మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్ . ఇప్పటికి కీర్తి సురేష్ ని అందరు టాప్ హీరోయిన్గా చెప్పుకుంటున్నారు ..అంటే దానికి మెయిన్ రీజన్ మహానటి సినిమా అని చెప్పాలి.

కాగా ఇలాంటి మంచి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ అవుతుంది. ఇంతటి మంచి సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఎవరో కాదు “నిత్యామీనన్”.

నాచురల్ గా నటించే సత్తా ఉన్న నిత్యామీనన్ ని ఫస్ట్ నాగ్ అశ్విన్ తన సినిమా కోసం చూస్ చేసుకున్నారట . కొన్ని పరసనల్ కారణాల చేత నిత్యామీనన్ ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట . ఈ సినిమా తర్వాత.. కీర్తి సురేష్ చేతికి వెళ్లి ఎంత పెద్ద హిట్ అయిందో ..ఆమె కెరియర్ ని ఎలా మార్చేసిందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా బ్యాడ్ లక్ పక్కనే ఉంటే ఎవరేం చేస్తారు చెప్పండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news