Newsబ్రేకింగ్‌: ప‌వ‌న్ - సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ టైటిల్ వ‌చ్చేసింది..

బ్రేకింగ్‌: ప‌వ‌న్ – సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ టైటిల్ వ‌చ్చేసింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఏకంగా నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నడుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తరికెక్కుతోంది.

అలాగే పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న సినిమా షూటింగ్ తో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజి – హరీశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో కూడా సెట్స్‌ మీద ఉన్నాయి. ఇక పవన్ – సాయితేజ సినిమా విషయానికి వస్తే కోలీవుడ్ సూపర్ హిట్ వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా వస్తుంది.

ప్రముఖ తమిళ హీరో సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన పార్ట్‌ షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా టైటిల్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో, మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకు దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్‌. పవన్ కళ్యాణ్ దేవుడిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో అంచనాలు అయితే మామూలుగా లేవనే చెప్పాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news