Moviesఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌లోనే ట్విస్ట్‌... టైటిల్ ఫైన‌ల్‌గా అదే ఫిక్స్...

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌లోనే ట్విస్ట్‌… టైటిల్ ఫైన‌ల్‌గా అదే ఫిక్స్ చేశారుగా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌కు నేష‌న‌ల్ లెవ‌ల్లో ఉన్న క్రేజ్ అలాంటి.. ఇలాంటిది కాదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ‌.. ఆ వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ఈ నెల 20న బర్త్ డే జరుపుకుంటున్నాడు.

ఈ బ‌ర్త్ డేకు ఒక రోజు ముందుగానే ఈ రోజు రాత్రి 7.02 గంట‌ల‌కు ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ 30 యూనిట్ కూడా అధికారిక ప్ర‌క‌ట‌న చేసేసింది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు కొర‌టాల‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన మిక్కిలినేని సుధాక‌ర్ ఈ సినిమాకు నిర్మాతలు.

ఈ భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండ‌గా… బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌, బ‌య‌ట‌కు వ‌చ్చిన స్టిల్స్ ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ రోజు వ‌చ్చే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టైటిల్ తో సినిమాకు మ‌రింత హైప్ వ‌చ్చేస్తుంద‌నే అంటున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు దేవ‌ర అనే టైటిలే కొర‌టాల ఫైన‌లైజ్ చేశాడంటున్నారు. ఇక కొర‌టాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో గ‌తంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద సక్సెస్ అందుకోవడంతో తప్పకుండా ఎన్టీఆర్ 30 సినిమా అంతకు మించి పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ హిట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news