Movies"అర్జున్ రెడ్డి" లో అన్ని "లిప్ కిస్సులు" వెనుక ఉన్న అసలు...

“అర్జున్ రెడ్డి” లో అన్ని “లిప్ కిస్సులు” వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో తెలుసా..? పచ్చిగా చెప్పేసిన షాలినీ..!!

“అర్జున్ రెడ్డి ” ఈ పేరు చెప్పగానే మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి . అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ లో బీట్ మ్యూజిక్ గుండె ఝల్లుమనేలా వినిపిస్తుంది. ప్రతి కుర్రాడికి తెలియని కొత్త ఫీలింగ్ కలుగజేస్తుంది . అంతలా అర్జున్ రెడ్డి సినిమా కుర్రాళ్ళ మనసులో పాతుకుపోయింది . సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా అప్పట్లో యువతని ఈ సినిమా పిచ్చెక్కించేసింది.

అంతలా అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ సైతం పాపులారిటీ సంపాదించుకున్నాడు . కాగా ఈ సినిమా కంటెంట్ అంతా వేరు.. ఈ సినిమాలో “మధురమే ఈ క్షణమే పాట వేరు”. ఈ సినిమాలో ఎన్ని ముద్దులు పెట్టాడో విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అబ్బాయి అంటే వేరు అలా పెట్టేస్తారు.. కానీ ఆ రేంజ్కి తగ్గట్టు ప్రీతి పాత్రలో నటించిన షాలినీ కూడా రెచ్చిపోయి ముద్దులు పెట్టింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

రీసెంట్ గా ఇదే ప్రశ్న షాలినీ పాండేకు ఎదురయింది . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ..” నాకు సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి.. ముద్దులు ఉంటాయని చెప్పారు.. కానీ ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని అస్సలు చెప్పలేదు . ఒకవేళ తెలిసి ఉంటే చేసి ఉండేదాన్ని కాదేమో ..అయితే సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది .ఇప్పటికి ఈ సినిమా వచ్చిన క్రేజ్ తోనే నన్ను గుర్తిస్తున్నారు.

ఐ యాం సో హ్యాపీ ” అంటూ చెప్పుకొచ్చింది. పాత్ర అనుసారంగా ఈ సినిమాలో ఇంత బోల్డ్ కంటెంట్ పెట్టినట్లు జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే అర్జున్ రెడ్డి సినిమాకి విజయ్ దేవరకొండ – షాలినీ పాండే కాకుండా మరి ఏ హీరో కూడా సెట్ అయి ఉండరు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news