News"నిజంగా మీకు ధైర్యం ఉంటే.. ఉప్పు కారం తింటే.. అలా చేయ్యండి"...

“నిజంగా మీకు ధైర్యం ఉంటే.. ఉప్పు కారం తింటే.. అలా చేయ్యండి” ..అనసూయ ఓపెన్ సవాల్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో అనసూయ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గా విజయ్ దేవరకొండ ది వివాదంపై అనసూయ ఏ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేసిందో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము . విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే ఏకి పారేస్తున్నారు . అంతేనా విజయ్ దేవరకొండ అభిమానులే కాకుండా సినీ స్టార్స్ కూడా ఆమెను టార్గెట్ చేసే ట్రోల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే అనసూయ తనపై వస్తున్న వార్తలు పై స్పందిస్తూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది . మరీ ముఖ్యంగా ఫేక్ థంబ్నెల్స్ పెట్టి సోషల్ మీడియాలో పలు వెబ్సైట్స్ ఆమెపై నెగటివ్గా రాసే వార్తలు పై మండిపడింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పై కూడా ఫైర్ అయిపోయింది. అనసూయ ఒక సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ..” నిజంగా మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే.. మీరు ఉప్పు కారం తింటుంటే.. నిజాన్ని నిజానిగా రాయండి.. సెలబ్రెటీల మీద వార్తలు రాసి కడుపునింప్పుకునే మీకు అలాంటి ధైర్యం లేదు” అంటూ ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోయింది .

అంతేకాదు ఫలానా హీరో ఫ్యాన్స్ అనసూయ ని వేధించారు ..ట్రోల్ చేశారు.. వెంట పడ్డారు ..ఇది కాదు ..పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ..అన్నవాడి నోరే కంపు.. చేతకాని వాళ్లు అదుపుతపుతారు.. ఇది మీరు పెట్టాల్సిన ధంబ్ నెయిల్.. బెటర్ లక్ నెక్స్ట్ టైం” అంటూ వీడియోని ఎండ్ చేసింది . ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అనసూయ మళ్లీ ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడటం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news