Moviesఅప్పుడే పెద్ద షాక్‌… NTR 30 నుంచి ఆ హీరో అవుట్‌…!

అప్పుడే పెద్ద షాక్‌… NTR 30 నుంచి ఆ హీరో అవుట్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దాదాపు యాడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. త్రిబుల్ ఆర్‌ సినిమా రిలీజ్ అయ్యాక .. వెంటనే కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే కొరటాల చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.ఈ సినిమాతో కొరటాల తెచ్చుకున్న ఇమేజ్ అంతా డ్యామేజ్ అయింది. ఈ సినిమా రిజ‌ల్ట్ నుంచి కొరటాల కోలుకోవడానికి ఐదారు నెలలు పట్టింది.

దీంతో ఎన్టీఆర్ సినిమా కోసం ముందుగా రాసుకున్న కథలో అనేక మార్పులు చేర్పులు చేయడంతో పాటు చాలా కసరత్తులే చేశాడు. ఎట్టకేలకు ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్‌ అలీ ఖాన్ పేరు వినిపించింది.

కొర‌టాల సైఫ్‌తో చర్చలు జరిపాడు.. ఇంకేముంది సైఫ్‌ ఈ సినిమాలో నటించడం ఖరారు అయిందంటూ నాలుగైదు రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సైఫ్ ఈ ఆఫ‌ర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పెద్ద షాకింగ్ న్యూసే. ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాలో నటించడానికి నిర్మాతలు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారట. ఈ ప్రాజెక్టులో భాగం కాలేదని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

దీంతో పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో మరో బాలీవుడ్ హీరో తో కొరటాల చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఒప్పుకుంటే వెంటనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5. 2024న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news