Moviesబాలయ్య-చిరంజీవి లతో రొమాన్స్ ..ఎవరు ది బెస్ట్..శృతి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్...

బాలయ్య-చిరంజీవి లతో రొమాన్స్ ..ఎవరు ది బెస్ట్..శృతి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ లు ఏ విధంగా బోల్డ్ గా మాట్లాడుతున్నారో.. బోల్డ్ గా నటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్స్ ఒక్క బూతు పదం మాట్లాడాలంటే సిగ్గు పడిపోయేవారు . ఇప్పుడు అలా కాదు వాళ్ళు మాట్లాడిన మాటలకు స్టార్ హీరోలు సైతం సిగ్గు పడిపోతున్నారు . అలా ట్రెండ్ మారుతుంది ..టెక్నాలజీ పెరిగిపోతుంది . అలాంటి కామెంట్స్ చేసే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

కమల్ కూతురు శృతిహాసన్ లాస్ట్ గా తెలుగులో నటించిన వీరసింహారెడ్డి – వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. రెండూ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. ఈ క్రమంలోనే శృతిహాసన్ రేంజ్ మారిపోతుంది అని అనుకున్నారు అంతా. అయితే అది మొత్తం రివర్స్ అయింది . సినిమా హిట్ టాక్ సంపాదించుకున్న ఇప్పటివరకు శృతిహాసన్ ఏ సినిమాకి సైన్ చేయలేదు.

రీసెంట్ గా మీడియాతో ముచ్చుటించిన శృతిహాసన్ కి..”మీ కంటే పెద్ద హీరోలతో నటించడం పై మీ స్పందన ఏంటి..?” అంటూ ప్రశ్న ఎదురైంది . ఈ క్రమంలోనే శృతి మాట్లాడుతూ “నిజానికి నేను ఎప్పుడు కధలని నమ్ముకుంటాను . సినిమాలో ఏ హీరో చేస్తున్నారో.. ఆ హీరోకి ఎంత స్టార్ డమ్ ఉందా ..? ఎంత అని నేను పట్టించుకోను.. మంచి నటన ఉన్నప్పుడు వయసుతో సంబంధం ఏముంది ..? ఎలాంటి వారితో అయినా నటించవచ్చు . నేను బాలయ్య సార్ తో చిరంజీవి సార్ తో ఇద్దరితో నటించాను . ఇద్దరు చాలా మంచి యాక్టర్స్ ..టాప్ హీరోలు. ఇద్దరితో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. అంతకంటే ఇంకేం కావాలి . నా లైఫ్ లో గుర్తుండిపోతాయి ఆ రెండు సినిమాలు” అంటూ చెప్పుకు వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news