Moviesగోవా బ్యూటీ ఇలియానాపై సౌత్ ఇండస్ట్రీ నిషేధం... పదేళ్ల తర్వాత బయటపడ్డ...

గోవా బ్యూటీ ఇలియానాపై సౌత్ ఇండస్ట్రీ నిషేధం… పదేళ్ల తర్వాత బయటపడ్డ సంచలన నిజాలు..!

దేవ‌దాస్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బ్యూటీ ఇలియానా. మొద‌టి సినిమాతోనే గోవా బ్యూటీ ప్రేక్ష‌కుల‌ను త‌న మాయ‌లో ప‌డేసుకుంది. అందం అభిన‌యంతో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కించింది. ఈ సినిమా తర‌వాత టాలీవుడ్ లో వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టింది. టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన జ‌ల్సా, అల్లు అర్జున్ కు జోడీగా న‌టించిన జులాయి సినిమా మ‌రియు మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన పోకిరి సినిమాలు ఇలియా మార్కెన్ మ‌రింత పెంచేశాయి.

అలా వ‌రుస హిట్ల‌తో అమ్మ‌డు గ్యాప్ లేకుండా సినిమాలు చేసింది. అంతే కాకుండా టాలీవుడ్ కు జీరో సైజ్ ను ప‌రిచ‌యం చేసింది కూడా ఈ బ్యూటీనే. ఇలియానా న‌డుముకు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఉంది అంటే అమ్మ‌డి క‌టౌట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్ కు క్రేజ్ ఉన్న స‌మ‌యంలో అక్క‌డ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

అంతే కాకుండా అక్క‌డ ఆఫ‌ర్ లు రావ‌డంతోనే సౌత్ ఇండ‌స్ట్రీ పై నోరు పారేసుకుని ఇక్క‌డ ఆఫ‌ర్ లు లేకుండా పోయింది. ఇక ప్ర‌స్తుతం ఇలియానా బాలీవుడ్ లోనే అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇలియానాను సౌత్ ఇండ‌స్ట్రీ ప‌దేళ్ల పాటూ బ్యాన్ చేసింది. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఇలియానా ర‌వితేజ కు జోడీగా దేవుడుచేసిన మ‌నుషులు సినిమాలో న‌టించింది. అయితే అదే స‌మ‌యంలో ఇలియానా త‌మిళంలో విక్ర‌మ్ హీరోగా న‌టరాజ్ నిర్మాణంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఆ సినిమాకు కొబ్బ‌రికాయ కూడా కొట్టారు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అయితే అప్ప‌టికే ఆ సినిమా కోసం ఇలియానాకు 40 ల‌క్ష‌ల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దాంతో ఇలియానాను ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల‌ని కోరారు. కానీ ఇలియానా డ‌బ్బులు ఇచ్చేదే లే కావాలంటే మ‌రో సినిమా చేస్తానంటూ తేల్చిచెప్పింది. దాంతో నిర్మాత ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ను ఆశ్ర‌యించ‌గా సౌత్ ఇండ‌స్ట్రీ గోవా బ్యూటీని ఏకంగా ప‌దేళ్ల‌పాటూ బ్యాన్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news