Moviesసమంత కావాలనే చైతన్య ని బ్యాడ్ చేస్తుందా..? శాకుంతలం సినిమాతో విడాకులకు...

సమంత కావాలనే చైతన్య ని బ్యాడ్ చేస్తుందా..? శాకుంతలం సినిమాతో విడాకులకు సంబంధం ఏంటి..!?

ఎస్ ప్రెసెంట్.. ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో సమంత ను డీగ్రేట్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సమంత.. కేవలం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నాగచైతన్య తో విడాకుల విషయంపై స్పందిస్తుందని .. ఈ క్రమంలోనే అమ్మడు కావాలని నాగచైతన్యని బ్యాడ్ చేస్తుంది అంటూ మండి పడుతున్నారు . దానికి రీజన్ లేకపోనూ లేదు.

ఈ మధ్యకాలంలో సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళినా తన డివర్స్ విషయాని హైలెట్ చేస్తూ మాట్లాడుతుంది . మరి ముఖ్యంగా రిపోర్టర్స్ అడిగినా సరే అలాంటి విషయాలపై నేను స్పందించను అని చెప్పకుండా మీడియా అడిగినదానికి డబల్ చేస్తూ ఆన్సర్ ఇస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”విడాకుల తర్వాత తాను ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు క్లియర్గా ఎమోషనల్ వివరించింది”. దీంతో అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శాకుంతలం సినిమాతో తన విడాకులకు సంబంధం ఏంటి ..? సినిమా ప్రమోషన్స్ కి వచ్చింది ప్రమోషన్స్ చేసుకోకుండా నాగచైతన్య గురించి ఎందుకు ప్రస్తావించాలి ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి సమంత – నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news