MoviesNBK 108: శ్రీలీల‌కు బాల‌య్య తండ్రి కాదా… బ‌య‌ట‌ప‌డ్డ ఆ రిలేష‌న్‌..!

NBK 108: శ్రీలీల‌కు బాల‌య్య తండ్రి కాదా… బ‌య‌ట‌ప‌డ్డ ఆ రిలేష‌న్‌..!

నందమూరి నరసింహ బాలకృష్ణ సంక్రాంతికి వీరసింహారెడ్డి లాంటి బ్లాక్బస్టర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో 108వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. సాహూ గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలయ్య భార్యగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల‌ కూడా కీలకపాత్రలో కనిపిస్తోంది. అలాగే కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా మరో పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్‌పాల్ విలన్ గా కనిపిస్తున్నాడు. కొద్దిరోజుల క్రిందటి వరకు ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.

తాజా అప్డేట్ ప్రకారం శ్రీలీలకు నాన్నగా బాలయ్య నటించడం లేదని… బాబాయి పాత్రలో కనిపిస్తాడని వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు సినిమాకే హైలెట్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ భాషలో మాట్లాడుతాడు. కథా నేపథ్యం కూడా తెలంగాణ ప్రాంతంతో కనెక్ట్ అయి ఉంటుందని తెలుస్తోంది. ఇక దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

శ్రీరామనవమి కానుకగా దసరాకు ఆయుధ పూజ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తమన్‌ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్లు కొడతారన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లో ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news