Moviesనాగ‌చైత‌న్య రెండో పెళ్లిపై అఖిల్ ఎట‌కారం... అక్కినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఏం...

నాగ‌చైత‌న్య రెండో పెళ్లిపై అఖిల్ ఎట‌కారం… అక్కినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది..?

నాగచైతన్య.. సమంతకు విడాకులు ఇచ్చి ఏడాదిన్నర దాటుతోంది. అప్పటినుంచి ఈ రోజు వరకు కూడా వీరిద్దరు విడాకులపై రకరకాల వార్తలు పుకారులు షికారులు చేస్తున్నాయి. తాజాగా నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడని.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు గత కొంతకాలంగా వీరిద్దరూ ఎక్కడ చూసినా కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.

లండన్ లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ వార్తలకు శోభిత కౌంటర్ ఇచ్చినా కూడా వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేనప్పుడు ఎందుకు ? కలిసిమెలిసి తిరుగుతున్నారు అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. నాగచైతన్య రెండో భార్య శోభిత అంటూ సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది. ఇదిలా ఉంటే అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్‌కు మ‌ధ్య‌ ఏమైనా విభేదాలు ఉన్నాయా ? చైతు సమంతను వదిలివేయడం.. ఆమెకు విడాకులు ఇవ్వడం అఖిల్ ఇష్టం లేదా అన్న కొత్త చర్చలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే మీ అన్నయ్య ఇటీవల ఓ హీరోయిన్ తో తిరుగుతున్నాడు.. మరి మీ పరిస్థితి ఏంటి అని అడిగారు. దానికి అఖిల్ అన్నయ్య గురించి ఆ హీరోయిన్ తో ప్రేమ గురించి స్పందించకుండా నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండు సంవత్సరాలుగా నా జుట్టు, బాడీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అంటూ కాస్త వెరైటీగా ఆన్సర్ ఇచ్చాడు.

ఇక అఖిల్ త‌న అన్న ప్రేమ‌ను ఖండించ‌నూ లేదు… దానిపై క్లారిటీనూ ఇవ్వ‌లేదు. అయితే ఆ ఆన్స‌ర్ చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే ఇప్పుడు చైతు.. శోభిత వెంట ప‌డ‌డం ఇష్టం లేద‌న్న‌ట్టుగా మాట్లాడిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. అఖిల్ ఆన్స‌ర్ చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే అక్కినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఏదో గ్యాప్ ఉంద‌నే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news