MoviesNTR-Chiranjeevi: ఒకే క‌థ‌తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ - చిరంజీవి…ఆ రెండు...

NTR-Chiranjeevi: ఒకే క‌థ‌తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ – చిరంజీవి…ఆ రెండు హిట్ సినిమాలు ఇవే…!


సినిమా రంగంలో ఒకే కథతో అటు ఇటు తిప్పి సినిమాలు తీయడం కామన్. సినిమా వాళ్లు ఎన్ని కథలు అని మాత్రం కొత్తగా పుట్టిస్తారు… పాత కథలను.. ఉన్న కథలనే అటు ఇటు తిప్పి ప్రేక్షకులను కాస్త రంజింప చేస్తూ హిట్లు కొడుతూ ఉంటారు. చివరకు టైటిల్స్ కూడా కొత్తవి లేకపోవడంతో… ఒకప్పుడు ఉన్న టైటిల్స్ నే ఇప్పుడు తిరిగి వాడేసుకుంటున్నారు. ఇక కథలు కాపీ కొట్టడం కూడా ఎప్పటినుంచో ఉన్నది. విచిత్రం ఏంటంటే గతంలో తెరకెక్కి హిట్లు కొట్టిన‌ సినిమా కథలనే ఇప్పుడు అటు.. ఇటు తిప్పి ఇటు తిప్పి తీసి మల్లి హిట్లు కొడుతున్నారు.

అలా ఒకే క‌థ‌తో మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ సినిమాలు తీసి హిట్లు కొట్టారు. మ‌రి ఆ సినిమాలు ఏంటో చూద్దాం. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బృందావనం సినిమా మంచి హిట్ కొట్టింది. వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. దిల్ రాజు నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌మంత హీరోయిన్లు.

ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టించిన బావ‌గారు బాగున్నారా సినిమా సూప‌ర్ హిట్‌. జ‌యంత్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో కూడా హీరో ముందు చెల్లిని ప్రేమించి.. ఆ త‌ర్వాత అక్క‌కు భ‌ర్త‌గా వ‌స్తాడు. అక్క‌డ హీరో అంటే హీరోయిన్ తండ్రికి ఏ మాత్రం న‌చ్చ‌దు. ఇక ఎన్టీఆర్ బృందావ‌నం సినిమాలోనూ దాదాపు అలాగే ఉంటుంది. స‌మంత‌ను ముందుగా ఎన్టీఆర్ ప్రేమిస్తాడు. ఆ త‌ర్వాత కాజ‌ల్‌ను కాపాడేందుకు ఆమె ల‌వ‌ర్‌గా వెళ‌తాడు.

అప్పుడు హీరోకు వాళ్లిద్ద‌రు అక్కాచెళ్లెల్లు అన్న విష‌యం తెలుస్తుంది. ఇక ప్ర‌కాష్‌రాజ్‌కు ఎన్టీఆర్ అంటే అస్స‌లు గిట్ట‌దు. ఇలా ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే క‌థాంశంతో వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టాయి. రెండు సినిమాల్లోనూ కావాల్సినంత కామెడీ పండింది. ఎమోష‌న్లు కూడా బాగా క్లిక్ అయ్యాయి. అలా రెండు సినిమాలు ఆయా హీరోల కెరీర్‌లో మంచి సినిమాలుగా నిలిచిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news