Moviesవ‌ర్మ శ్రీదేవిని కాకుండా 12 ఏళ్ల పాటు ఆ హీరోయిన్‌ను ప్రేమించాడా......

వ‌ర్మ శ్రీదేవిని కాకుండా 12 ఏళ్ల పాటు ఆ హీరోయిన్‌ను ప్రేమించాడా… ఈ ప్రేమ ఎలా బ్రేక‌ప్ అంటే..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఏక చక్రాధిపత్యంతో దూసుకుపోయారు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వర్మ ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఒకప్పుడు దేశం మొత్తం మెచ్చుకున్న వర్మ గత కొంతకాలంగా చౌకబారు సినిమాలు, అడల్ట్ కంటెంట్ సినిమాలు, బూతు కామెంట్లతో దిగజారిపోయాడు.

ఇప్పుడు వర్మ స్థాయి పోర్న్ డైరెక్టర్ స్థాయి కంటే ఘోరంగా పడిపోయింది. ఇక వర్మ అమ్మాయిల విషయంలో ఎంత చీఫ్‌గా బిహేవ్ చేస్తున్నాడో గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. అతిలోకసుందరి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని.. ఆమెను ఎంతో గాఢంగా ప్రేమించానని అయితే ఆమెను బోనీకపూర్ చేసుకుని తన పాలిట విలన్ గా మారిపోయాడు అంటూ ఎన్నోసార్లు తాను శ్రీదేవిని ప్రేమించిన విషయాన్ని వర్మ చెప్పాడు.

అయితే శ్రీదేవి కంటే ముందుగానే వర్మ మరో స్టార్ హీరోయిన్ ని కూడా దేవతగా ఆరాధించే వారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు సహజనటి జయసుధ. వర్మ విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే జయసుధ అంటే ఎంతో ఇష్టపడేవారట. జయసుధ నటించిన సినిమాల పోస్టర్లు గోడల మీద గంటల తరబడి ఉండి చూసేవారట. జయసుధ నటించిన అమరదీపం సినిమాను పోరంకి రామప్రియ థియేటర్లో ఏకంగా ఏడుసార్లు చూశారట.

అందులో జయసుధ క్లోజప్ షాట్ కోసమే అన్నిసార్లు చూశానని.. ఆమెను దాదాపు 12 సంవత్సరాల పాటు ఒక దేవతలా ఆరాధించానని వర్మ చెప్పారు. జయసుధ నటించిన రావు గారి ఇల్లు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానట వ‌ర్మ‌. అప్పుడు ఆమెను దగ్గరగా ఉండి చూడడంతో పాటు డైలాగులు రాసి ఆమెకు వినిపిస్తే ఆమె మెచ్చుకుంటారు ఏమో ? అని ఆత్రుతతో ఎదురుచూసే వాడిని వర్మ చెప్పారు.

అయితే మనీ మనీ సినిమా కోసం కథ చెప్పేందుకు ఆమె ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టానని.. తన ఎదురుగా జయసుధ భర్త నితిన్ కపూర్ ను చూడగానే తన ప్రేమ అంతా మటుమాయం అయిపోయిందని వర్మ చెప్పాడు. ఇక తాను సినిమాల్లోకి వచ్చాక శ్రీదేవిని ఎంతలా ఆరాధించానో ? ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news