Moviesదసరా డైరెక్టర్ తో ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే...

దసరా డైరెక్టర్ తో ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..లైఫ్ లో మర్చిపోలేని బంధం..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పేరు మారుమ్రోగిపోతుంది . నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే జనాలు అసలు గుర్తుపట్టే వాళ్లే కాదు. కాగా రాత్రికి రాత్రి ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మనకు తెలిసిందే ఆయన రీసెంట్గా లేటెస్ట్ గా తెరకెక్కించిన సినిమా దసరా . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది .

నిన్న ధియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . అంతేకాదు నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 14 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ గా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ శ్రీకాంత్ డైరెక్షన్ అయితే ..సెకండ్ ప్లస్ పాయింట్ నటీనటుల యాక్షన్స్. ఎవరికి తగ్గ పాత్రలో వాళ్ళు జీవించేశారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ శ్రీకాంత్ ఈదెలా కు జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . శ్రీకాంత్ ఓదెలాకు జూనియర్ ఎన్టీఆర్ తో చిన్న సంబంధం ఉంది . ఇది చాలామందికి తెలియదు . ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శ్రీకాంత్ ఓదెలా పనిచేశాడు. ఆయన తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు శ్రీకాంత్ . ఈ విషయాన్ని శ్రీకాంత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా మొత్తానికి డైరెక్టర్ కావడానికి ముందే ఎన్టీఆర్ తో కలిసి శ్రీకాంత్ వర్క్ చేసేసాడు . ఇక ఫ్యూచర్లో ఆయనతో అవకాశం అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news