Moviesబిగ్ బ్రేకింగ్‌: బాల‌య్య - అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ డేట్...

బిగ్ బ్రేకింగ్‌: బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది…

నందమూరి నట‌సింహ గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమా కూడా తెలుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తొలి రోజు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన కెరీర్ లోనే 108వ సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే ప్రారంభ‌మైన‌ ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఉగాది కానుకగా మేకర్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా గురించి ఈరోజు అదిరిపోయే అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

విజయదశమికి ఆయుధపూజ అని ఒక పోస్టర్‌తో ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ వెల్లడించడానికి బాలయ్య నుంచి ఓ అదిరిపోయే మాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్‌ శ్రీలీల బాల‌య్య కుమార్తెగా కీలకపాత్రలో కనిపిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సీ శ్రీరామ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏది ఏమైనా అఖండ, వీర సింహారెడ్డి తర్వాత బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్‌ విజయాలు తన ఖాతాలో వేసుకుంటారు అన్న ధీమా టాలీవుడ్ వర్గాల్లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news