MoviesJr NTR కెరీర్ లో చేసిన ఆ చిన్న తప్పు కారణంగా.....

Jr NTR కెరీర్ లో చేసిన ఆ చిన్న తప్పు కారణంగా.. ఎన్టీఆర్ ఇప్పటికి బాధపడుతున్నాడా..?

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. ఎంతలా అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు.

మరీ ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటుడు కూడా ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోనే కావాలి అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తూ నెంబర్ వన్ హీరో లిస్టులో ఉన్న ఎన్టీఆర్ ఇప్పటికీ ఆయన కెరియర్లో చేసిన చిన్న తప్పు కారణంగా బాధపడుతూనే ఉమ్న్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి కొంచెం బొద్దుగా ఉండేవారు.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి సింహాద్రి సినిమా వరకు మనకు అలాగే కనిపిస్తాడు .

ఆ తర్వాత రాజమౌళి చెప్పిన సజెషన్స్ తో ఎన్టీఆర్ వెయిట్ తగ్గాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బొద్దుగా ఉన్నప్పుడు మంచి మంచి ఆఫర్స్ రిజెక్ట్ చేశాడు. ఆ పాత్రకి నేను సెట్ అవ్వను అంటూ రిజెక్ట్ చేయడంతో ఆ క్యారెక్టర్స్ వేరే హీరోలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట . అలా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేస్తున్న టైంలోనే తారక్ కి ఇచ్చిన సజెషన్ పాటించి ఉంటే తన కెరియర్లో ఇంకా ఎక్కువ హిట్స్ ఉండేటివి. ఆ విషయంలో ఇప్పటికి ఎన్టీఆర్ బాధపడుతూనే ఉంటారట . ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ థర్టీ సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 సినిమాను కూడా చేయబోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news