MoviesManchu Mounica మంచు మ‌నోజ్ భార్య మౌనికలో ఈ గొప్ప ల‌క్ష‌ణం...

Manchu Mounica మంచు మ‌నోజ్ భార్య మౌనికలో ఈ గొప్ప ల‌క్ష‌ణం ఉందా… దానికే మ‌నోజ్ ప‌డిపోయాడా…!

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్‌.. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన రాజ‌కీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికా రెడ్డిని గ‌త రాత్రి పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తులు ఇద్ద‌రికి ఇది రెండో పెళ్లి. ఇదిలా ఉంటే మ‌నోజ్ భార్య మౌనిక‌లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇది గ‌తంలో అంద‌రికి తెలిసిందే అయినా… ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. ఆళ్ల‌గ‌డ్డ ప‌రిస‌ర ప్రాంతాల్లో భూమా కుటుంబానికి ఎంత మంచి పేరు ఉందో తెలిసిందే.

మౌనిక‌కు మంచి సేవా ధృక్ప‌థం ఎక్కువ‌. త‌న త‌ల్లిదండ్రుల నుంచే ఆమెకు ఈ గుణం వ‌చ్చింది. త‌మ నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ ప్రాంతాల్లో ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉంటే ఆమె ఆదుకుంటుంద‌ట‌. అలాగే ఆమెకు ప్ర‌జాసేవ చేయ‌డం ఇష్టం.. రాజ‌కీయాల ప‌ట్ల కూడా ఆస‌క్తి మెండుగా ఉంద‌ట‌. త‌న త‌ల్లిదండ్రులు ఎన్నిక‌ల్లో పోటీచేసిన‌ప్పుడు ఆమె ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో వారిని గెలిపించాల‌ని ప్ర‌చారం కూడా చేశారు.

అలాగే 2017లో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని గెలిపించాల‌ని ఆమె ప్ర‌చారం చేశారు. ఆ ఉప ఎన్నిక‌ల్లో ఆమె ప‌లు ఛానెల్స్‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చారు. ఆమెకు మంచి వాగ్దాటి ఉంద‌ని.. ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తే స‌క్సెస్ అవుతార‌న్న టాక్ అప్పుడే వ‌చ్చింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు చూసిన వారు కూడా ఆమె త‌ల్లి, తండ్రిలా చ‌క్క‌గా మాట్లాడ‌తారు అనే పేరు తెచ్చుకున్నారు.

వీటితో పాటు స్నేహానికి ఆమె ఇచ్చే విలువ‌, క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మ‌నోస్థైర్యంతో ఉండ‌డం ఇవ‌న్నీ మ‌నోజ్‌కు న‌చ్చే ఆమెతో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాడ‌నే అంటున్నారు. ఇక గ‌తంలో కూడా వీరిద్ద‌రు మంచి మిత్రులే. ఇక మౌనిక‌కు రాజ‌కీయాల ప‌ట్ల ఉన్న ఆస‌క్తి, బ‌ల‌మైన రాజ‌కీయ వార‌స‌త్వానికి తోడు, ఇటు మ‌రో బ‌ల‌మైన మంచు ఫ్యామిలీ అండ‌దండ‌లు ఉండ‌డంతో ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని కూడా అంటున్నారు. మరి మౌనిక – మ‌నోజ్ కొత్త జీవితం ఎలా ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news