Moviesజక్కన్న తన సినిమా హీరోయిన్స్ ని అది చూసే సెలక్ట్ చేస్తారా..?...

జక్కన్న తన సినిమా హీరోయిన్స్ ని అది చూసే సెలక్ట్ చేస్తారా..? రాజమౌళి అంత జాదుగాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా దర్శకధీరుడు రాజమౌళి పేరు చెప్తే వచ్చే గూస్ బంప్స్.. అరుపులు ..కేకలే వేరు . ఎలాంటి హీరో కైనా హీరోయిన్ కైనా సరే జక్కన్న అనగానే తెలియని పులకరింపు వస్తుంది. అబ్బా ఒక్కసారి అయినా సరే ఆయన డైరెక్షన్ లో నటిస్తే బాగుండు అన్న ఆశ కోరిక పుడుతుంది. అంతలా తన పేరుకి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ జక్కన్న .

కాగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడే జక్కన్న.. తన సినిమాలో మాత్రం క్రేజ్ లేని హీరోయిన్స్ నే పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడట. దానికి మెయిన్ రీజన్ కాల్ షీట్స్ అంటూ తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ ఉందో అందరికీ తెలిసిందే . ఓ సినిమాని చేస్తూ మరో నాలుగు సినిమాలకు కమిట్ అయ్యే ముద్దుగుమ్మలు ఉన్నారు ఇండస్ట్రీలో . అయితే జక్కన్న మైండ్ సెట్ కి అలాంటివి సెట్ అవ్వవు.

ఆయన సినిమా కమిట్ అయితే మరి ఏ సినిమాలోను నటించకూడదు ..ఆయనకిచ్చిన డేట్స్ ఆయనకే వర్తించాలి.. హడావిడిగా ఇక్కడ షూటింగ్ అక్కడ షూటింగ్ అంటూ లేనిపోని సాకులు చెప్పకూడదు. అందుకే జక్కన్న తన సినిమాలో హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు ఏ సినిమాలకు కమిట్ అయి ఉన్నారా ..? ఎప్పుడు ఆ సినిమాలు కంప్లీట్ అవుతాయి.. మనకి ఎన్ని కాల్ షీట్స్ ఇవ్వగలుగుతారా? కాల్ షీట్స్ ఇచ్చాక ఇబ్బంది పెట్టరు కదా ..? అనే దాన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారట.

ఎంత ఇష్టపడిన హీరోయిన్ అయినా సరే ..ఆమె కాల్ షీట్స్ బిజీగా ఉంటే ..ఆమెను కచ్చితంగా సినిమాకి సెలెక్ట్ చేసుకోరట. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రాజమౌళి సినిమాలో నటించిన హీరోయిన్స్ అందరూ అదే కోవాలోకి వస్తారు. తన సినిమాకి కమిట్ అయినప్పుడు ఆ హీరోయిన్స్ వేరే ఏ సినిమాకి కమిట్ అవ్వరు . టోటల్ రాజమౌళికే ఆ టైంను కేటాయిస్తారు. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో రాజమౌళి పైకి కనిపించడు కానీ మహా జాదుగాడే అంటున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news