MoviesVijay Nirmala-Krishna విజ‌య‌నిర్మ‌ల - కృష్ణ పెళ్లిని ముందే ఊహించిన ఆ...

Vijay Nirmala-Krishna విజ‌య‌నిర్మ‌ల – కృష్ణ పెళ్లిని ముందే ఊహించిన ఆ స్టార్ ఎవ‌రు…!

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌పై త‌మ‌దైన ముద్ర వేసిన‌.. సూప‌ర్ స్టార్ న‌ట‌శేఖ‌ర కృష్ణ‌, దిగ్గ‌జ న‌టీమ‌ణి ద‌ర్శ‌కురా లు.. విజ‌య‌నిర్మ‌ల ఇద్ద‌రూ క‌లిసి అనేక చిత్రాల్లో న‌టించారు. హీరో హీరోయిన్లుగా అంద‌రినీ మెప్పించారు. అయితే.. వారు నిజ‌జీవితంలోనూ దంప‌తులు అనే విష‌యం తెలిసిందే క‌దా! అయితే.. వీరు పెళ్లి చేసుకుంటార‌ని.. వీరి జీవితం సుఖంగా సాగుతుంద‌ని.. ముందుగానే ఊహించిన వారు కూడా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

విజ‌య‌నిర్మ‌ల‌-కృష్ణ పెళ్లి ఖాయ‌మ‌ని.. ముందుగానే ఊహించి చెప్పిన న‌టుడు ఎవ‌రోకాదు.. అప్ప‌టి స్టార్ క‌మెడియ‌న్‌.. పుణ్య‌మూర్తుల రాజ‌బాబు. వాస్త‌వానికి అప్ప‌టికే విజ‌య‌నిర్మ‌ల‌కు, కృష్ణ‌కు వేర్వేరు వ్య‌క్తుల‌తో పెళ్లిళ్లు అయిపోయాయి. అయిన‌ప్ప‌టికీ.. సినిమాల్లో మాత్రం క‌లిసి న‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా.. రాజ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు.. వారి జీవితాల్లో నిజం కావ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగిందంటే..
1967లో వచ్చిన బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ‘సాక్షి’ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అనే విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఇక‌, ఈ సినిమా షూటింగ్ గోదావరి తీరంలోని పులిదిండిలో జరిగింది. దర్శకుడు బాపు.. గ్రామంలోని మీసాల కృష్ణుడి గుడిలో వీరిద్దరిపై ఓ సీన్ ప్లాన్ చేశారు. ఆ సీన్‌లో ఇద్దరూ నూతన దంపతుల గెటప్‌లో కనిపిస్తారు.

షూటింగ్ ప్రారంభ‌మైంది.. క‌ట్ చెప్పారు. ఇక‌, ఇదంతా గమనిస్తున్న రాజబాబు ఓ కామెంట్ చేశార‌ట‌… ఈ గుడి చాలా మహిమ కలదని.. ఇక్కడ జరిగే ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతాయి అని వ్యాఖ్యానించార‌ట‌. ఈ నేప‌థ్యంలో కృష్ణ‌-విజ‌య‌నిర్మ‌ల విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని కూడా అన్నారట. అయితే యాదృచ్ఛికంగా ఆ తర్వాత రెండేళ్లకే కృష్ణ‌-విజ‌య‌నిర్మ‌ల‌ తిరుపతిలో పెళ్లి చేసుకుని ఒక ఇంటివారు కావ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. సంగ‌తి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news