MoviesDivya Bharathi దివ్యభారతి మరణానికి రెండు రోజుల ముందు ఊటీలో ఏం...

Divya Bharathi దివ్యభారతి మరణానికి రెండు రోజుల ముందు ఊటీలో ఏం జరిగింది…!

దివ్యభారతి కరెక్ట్ గా 30 సంవత్సరాల క్రితం బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని అతి తక్కువ సమయంలో ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో దివ్యభారతి అంటే ఒక సంచలనం. చేసింది 20 సినిమాలే అయినా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సినీ ప్రేమికుల మనసులను కొల్లగొట్టింది. అటు అందంతో పాటు చూడ చక్కని అభినయం.. చిలిపి కళ్ళు.. ఇవన్నీ ఆమెను అతి తక్కువ సమయంలో ప్రేక్షకులకు దగ్గర చేశాయి. మహారాష్ట్రలో 1974లో జన్మించిన దివ్యభారతి 19 ఏళ్ళ వయసులోనే తిరుగులేని స్టార్‌డమ్‌ తెచ్చుకుంది.

గోవిందా హీరో ఆమె న‌టిస్తోన్న ఓ సినిమా షూటింగ్ సమయంలో అప్పట్లో బాలీవుడ్‌లో నిర్మాతగా ఉన్న సాజిద్ నడియ‌ద్ వాలాతో పరిచయం కావడంతో అది ప్రేమగా మారి రహస్యంగా పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. 18 సంవత్సరాల వయసులో సాజీద్ స్వగృహంలో కేవలం నలుగురైదుగురు సన్నిహితులు సమక్షంలో దివ్యభారతి అతడిని వివాహమాడింది. వివాహం జరిగిన ఏడాదికే దివ్యభారతి ముంబైలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి పై ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి.

ఆమె భవనం పైనుంచి కింద పడి మృతి చెందిందని ప్రపంచానికి తెలిసిన విష‌యం. దీని వెనక అసలు ఏం జరిగిందన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు పట్టని రహస్యంగా మిగిలిపోయింది. సాజిద్ ఆమెను తీవ్రంగా కొట్టాడని… పెళ్లైన ఏడాదికే వారిద్దరి మధ్య విభేదాలు కూడా తలెత్తాయని… ఆమె చనిపోవడానికి ముందు కూడా పెద్ద గొడవ జరిగిందని అంటారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన బొబ్బిలి రాజా సినిమాతో హీరోయిన్‌గా ఆమె పరిచయం అయింది.

ఆ తర్వాత మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్, చిట్టెమ్మ మొగుడు, బాలకృష్ణతో ధర్మక్షేత్రం, చిరంజీవితో రౌడీ అల్లుడు లాంటి సినిమాలు చేసింది. ఇక చివరగా ప్రశాంత్‌తో తొలిముద్దు సినిమా చేస్తోంది. ఆ సినిమా షూటింగ్ 60% కంప్లీట్ అయింది. ఆమె చనిపోవడానికి రెండు రోజుల ముందు కూడా ఊటీలో వేసిన స్పెషల్ సెట్లో షూటింగ్ జరిపారు. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్‌కు షిఫ్ట్ కావాల్సి ఉంది. హైదరాబాద్‌లోనూ స్పెషల్ సెట్ వేశారు.

మధ్యలో రెండు రోజుల గ్యాప్ వచ్చింది. దీంతో దివ్యభారతి దర్శకుడుని కన్విన్స్ చేసి ముంబై వెళ్లి వచ్చేస్తానని… హైదరాబాద్ షెడ్యూల్‌కు ఉదయం కల్లా అటెండ్ అవుతానని చెప్పడంతో దర్శక, నిర్మాతలు ఆమెకు ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసి మరీ ముంబై పంపారు. ఊటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వెంటనే ముంబై వెళ్ళిన దివ్యభారతి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె సేఫ్ గా తిరిగి వచ్చినట్లయితే హైదరాబాద్ షెడ్యూల్లో పాల్గొనాల్సి ఉంది.

దురదృష్టవశాత్తు ఆమె మృతితో ఆమె కేరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోయింది. అయితే తొలిముద్దు దర్శకుడు ఆ తర్వాత రంభ‌ను హీరోయిన్‌గా పెట్టి మిగిలిన బ్యాలెన్స్ సినిమా పూర్తి చేశారు. ఇక దివ్యభారతితో బొబ్బిలి రాజా లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన వెంకటేష్ ఆమెతో మరో సినిమాలో నటించాలని ఆశపడ్డారు. తన తర్వాత సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు వెంకీ కోరిక తీరకుండానే దివ్యభారతి మృతి చెందారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news