Movies"ఆ ముఖానికి అంత సీన్ లేదు".. నయన్ పై ప్రభాస్ బ్యూటీ...

“ఆ ముఖానికి అంత సీన్ లేదు”.. నయన్ పై ప్రభాస్ బ్యూటీ షాకింగ్ కామెట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య పోటీ సర్వసాధారణం.. అలా పోటీ లేకపోతే నెట్టుకు రాలేరు ..పోటీ ఉంటేనే వాళ్ళ లోని అసలు నటీనటులు బయటపడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు అలాంటి పోటీని తట్టుకోలేక పలువురు హీరోయిన్స్ హీరోస్ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు . తమలోని కోపాన్ని బయటపెడుతూ.. అడ్డంగా బుక్ అవుతూ ఉంటారు . తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ .

మలయాళ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న మాళవిక మోహనన్.. కోలీవుడ్ – టాలీవుడ్ జనాలకు సుపరిచితురాలే. తాజాగా మాళవిక మోహనన్ – ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ రాజా డీలక్స్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ నయనతార పై సంచలన కామెంట్స్ చేసింది. ఇదివరకే నయనతారపై పలు రకాల.. పలు విధాల పరోక్షకంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ అయిన మాళవికమోహనన్.. ఈసారి డైరెక్ట్ అటాక్ చేసింది.

మాటల సందర్భంలో హోస్ట్ ప్రశ్నిస్తూ .. ” లేడీ సూపర్ స్టార్ నయనతారపై మీరు ఏమంటారు..? మీ స్పందన ఏంటి..? అంటూ ప్రశ్నించగా నా దృష్టిలో లేడీ సూపర్ స్టార్ కాదు .. అలా పిలిస్తే నేను ఒప్పుకోను అంటూ తెగేసి చెప్పింది . ఈ క్రమంలోనే నయనతారపై మాళవిక మోహనన్ కు ఉన్న కోపం మరోసారి బయటపడింది . జనాలు కూడా అది నిజమేగా నీ ఫేస్ కి ..లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు దండ గా అంటూ ఘాటు గా కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో సోషల్ మీడియాలో నయన్ VS మాళవిక మోహనన్ మధ్య వార్ పీక్స్ కి చేరింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news