MoviesRajamouli రాజ‌మౌళికి ఆ సీనియ‌ర్ న‌టుడితో మాట‌ల్లేనంత గొడ‌వ జ‌రిగిందా…!

Rajamouli రాజ‌మౌళికి ఆ సీనియ‌ర్ న‌టుడితో మాట‌ల్లేనంత గొడ‌వ జ‌రిగిందా…!

టాలీవుడ్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎలాంటి అంచ‌నాలు లేకుండా టాలీవుడ్‌లో స్టూడెంట్ నెంబ‌ర్ 1 సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన రాజ‌మౌళి ఇప్పుడు ఏకంగా ప్ర‌పంచం మొత్తం మెచ్చే గొప్ప ద‌ర్శ‌కుడు అయిపోయాడు. రాజ‌మౌళి సినిమా వ‌స్తోందంటే చాలు ఇండియ‌న్ సినిమా మాత్ర‌మే కాదు.. ఇప్పుడు ప్ర‌పంచం అంతా ఆస‌క్తిగా ఆ సినిమా వైపు చూసేంత స్థాయికి మ‌నోడు ఎదిగిపోయాడు

రాజ‌మౌళి సినిమాల్లో చిన్న పాత్ర వ‌చ్చినా చాలు అనుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. న‌టీన‌టులు మాత్ర‌మే కాదు.. టెక్నీషియ‌న్లు కూడా రాజ‌మౌళి సినిమాలో ప‌నిచేసే ఛాన్స్ వ‌స్తే జ‌న్మ‌కు చాలు ధ‌న్యం అయిపోతుంద‌ని ఫీల‌వుతూ ఉంటారు. అయితే ఓ సీనియ‌ర్ న‌టుడు మాత్రం రాజ‌మౌళితోనే షూటింగ్‌లో పెద్ద గొడ‌వ‌కు దిగార‌ట‌. ఆ త‌ర్వాత రాజ‌మౌళి కూడా ఆయ‌న‌కు త‌న సినిమాల్లో ఛాన్సులు ఇవ్వ‌లేద‌నే అంటారు.

ఆ సీనియ‌ర్ న‌టుడు ఎవ‌రో కాదు రంగ‌నాథ్‌. రాజ‌మౌళి సినిమాల్లోకి రాక‌ముందు రాఘ‌వేంద్ర‌రావు బ్యాన‌ర్లో శాంతినివాసం సీరియ‌ల్ నిర్మిస్తే దానికి రాజ‌మౌళీయే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అప్ప‌ట్లో ఈటీవీలో ప్ర‌సార‌మైన ఈ సీరియ‌ల్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ ఫ్యామిలీ పెద్ద‌గా రంగ‌నాథ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. రంగ‌నాథ్ న‌ట‌న‌లో ఎంతో గొప్పోడు. అందులో ఎలాంటి డౌట్ లేదు.

అయితే శాంతినివాసం సీరియ‌ల్‌ను రాజ‌మౌళి సీరియ‌ల్ రేంజ్‌లో తీసేశాడ‌ట‌. కొన్ని సార్లు రాజ‌మౌళి చెప్పిన విష‌యాల‌ను కూడా రంగ‌నాథ్ ప‌ట్టించుకోకుండా.. ఇలా ఎందుకు ? అదీ ఇదీ అని డిస్క‌ర్ష‌న్ పెట్టేవాడ‌ట‌. ఆ టైంలో రంగ‌నాథ్ రాజ‌మౌళిపై బాగా కోప‌డ్డేవార‌ట‌. అయినా రాజమౌళి అవేం ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుపోయేవార‌ట‌.

త‌ర్వాత రాజ‌మౌళి ఎంతో గొప్ప డైరెక్ట‌ర్ అయ్యారు. శాంతినివాసం సీరియ‌ల్ న‌టులు అంద‌రికి త‌న సినిమాల్లో ఛాన్సులు ఇచ్చినా రంగ‌నాథ్‌ను మాత్రం త‌న సినిమాల్లో పెట్టుకోలేదు. దీనికి కార‌ణం శాంతినివాసం సీరియ‌ల్ టైంలో జ‌రిగిన గొడ‌వే కార‌ణం అంటారు. ఆయ‌న త‌న‌తో ప్ర‌వ‌ర్తించిన తీరుకు రాజ‌మౌళి బాగా నొచ్చుకున్నార‌ని కూడా టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news