Moviesకధ వినకుండానే "వీరసింహా రెడ్డి" సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ బ్యూటీ...

కధ వినకుండానే “వీరసింహా రెడ్డి” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ బ్యూటీ .. బాలయ్యను హర్ట్ చేసిన హీరోయిన్ ఈమె..!!

టాలీవుడ్ నటి సింహం నందమూరి బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించాడు. కాగా మైత్రి మూవీ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా ఒంగోలులో జరిపారు . సినిమా టీజర్ , ట్రైలర్ ,ఫస్ట్ లుక్స్, పాటలు కంటే ఊగిపోయే విధంగా ఉన్నింది బాలయ్య స్పీచ్ .

మిగతా సినిమాకి సంబంధించిన సభ్యులు కూడా ఓ రేంజ్ కిక్ ఎక్కించేలా మాట్లాడడంతో సినిమా కి మంచి బజ్ క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా స్టేజ్ పై బాలయ్య ఎప్పుడు లేని విధంగా మాస్ లాంగ్వేజ్ వాడుతూ మాట్లాడడం నందమూరి అభిమానులకు కొత్త ఊపును ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన స్టార్ డాటర్ శృతిహాసన్ సైతం తనదైన స్టైల్ లో మాట్లాడి చిందులేసింది . కాగా బాలయ్యతో నటించే ముందు వరకు చాలా సైలెంట్ గా ఉన్న శృతిహాసన్ బాలయ్యతో నటించాక ఆయన ఎనర్జీలో సగం లాగేసినట్లుంది.. అందుకే స్టేజి పై ఓ రేంజ్ లో చీర కట్టుకొని మరి నడుమును తెగ ఊపేసింది .

కాగా మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా బాలయ్య లక్కి హీరోయిన్ నయనతార ని అనుకున్నారట. కానీ ఆమె డేట్లు కుదరకపోవడంతో ఈ సినిమా స్టోరీ వినకుండానే రిజెక్ట్ చేసిందట . దీంతో బాలయ్య సైతం నయన్ విషయంలో హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. నిజంగా ఒకవేళ బాలయ్య పక్కన నయనతార నటించి ఉంటే మాత్రం ఈ సినిమాకి మరింత బజ్ ఏర్పడి ఉండేదని సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేదని జనాలు చెప్పుకొస్తున్నారు. అలాంటి ఓ చెరగని క్రేజ్ సంపాదించుకుంది నయన్-బాలయ్య జంట..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news