Moviesఎంత రాత్రి అయినా విజయ్ వర్మ ఖచ్చితంగా అలా చేస్తాడు.. ఆ...

ఎంత రాత్రి అయినా విజయ్ వర్మ ఖచ్చితంగా అలా చేస్తాడు.. ఆ స్పెషల్ క్వాలిటీకే పడిపోయిన తమన్నా..!!

నిన్న మొన్నటి వరకు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు .. నేనెవరితో డేటింగ్ చేయట్లేదు అంటూ తనకు తానే డప్పు కొట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్న.. రీసెంట్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తన ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ ని అనఫిషియల్ గా జనాలకు పరిచయం చేసేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫుల్ తప్ప తాగి తూలుతూ ఊగుతూ తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మతో లిప్ లాక్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ఎలా టాప్ రేంజ్ ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే .

దీంతో పెళ్లి అనే పదానికి దూరంగా ఉంటున్న తమన్నా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు . తమన్నా తో లిప్ లాక్ చేసిన విజయ్ వర్మ ఎవరో కాదు బాలీవుడ్ లో పలు రోల్స్ చేసి పాపులారిటీ సంపాదించుకున్న హీరో. తెలుగులోనూ నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్ర పోషించి జనాలు చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

అయితే తెలుగులో పెద్దగా పాపులారిటీ దక్కకపోడంతో కేవలం బాలీవుడ్ కే పరిమితమైన విజయ్ వర్మ తమన్నాతో కలిసి “లస్ట్ స్టోరీ 2 ” ప్రాజెక్టులో భాగమైయాడు. ఈ సినిమా షూటింగ్లోనే వీళ్ళిద్దరూ దగ్గర అయ్యిన్నట్లు ..వీరి మధ్య ప్రేమ పెరిగింది అన్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . కాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకుని రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా కెమెరా కంటికి చిక్కింది తమన్న. అంతేకాదు విజయవర్మ లో ఎవరికి తెలియని గుడ్ క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. ఆయనకు టైం ఉన్నప్పుడల్లా రోడ్డు మీద పడుకొని ఉన్న అనాధలకు ఫుడ్ , దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉంటారట . అంతేకాదు ఎంత రాత్రి అయినా సరే తాను అనుకుంటే నిద్రలో లేచి అయినా సరే అలా వెళ్లి పేదవారికి సహాయం చేస్తారట. ఈ క్వాలిటీ నచ్చే తమన్నా విజయ్ వర్మకు పడిపోయింది అంటూ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news