Movies"ఆ విషయంలో తప్పు నాదే .. బుద్ధి లేక అలా చేశా"..ఆ...

“ఆ విషయంలో తప్పు నాదే .. బుద్ధి లేక అలా చేశా”..ఆ విషయంలో ఫీల్ అవుతున్న పూజా హెగ్డే..!!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు తారుమారవుతాయో ఎవరు గెస్ చేయలేరు . ఈ విషయం చాలామందికి తెలిసిందే . అయినా సరే ఇండస్ట్రీలో ఉండే రంగుల మాయకి కొందరు అలా అట్రాక్ట్ అయిపోతుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ పూజా హెగ్డే ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా పట్టుమంటే పది హిట్లు కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింpoది. పూజా హెగ్డే ఒకానొక టైంలో ఇండస్ట్రీని ఏలేస్తే హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది .

అయితే గత ఏడాది ఆమె రిలీజ్ చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాఖ్ ని సొంతం చేసుకోవడంతో పూజ హెగ్డే పేరు మళ్లీ ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. ఈ క్రమంలోనే పోగొట్టుకున్న ఆఫర్స్ ను ట్రెండ్ చేస్తూ పూజా హెగ్డే తీసుకున్న చెత్త నిర్ణయాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నారు ట్రోలర్స్. మనకు తెలిసిందే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లక్కీ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే హీరోయిన్గా అనుకున్నారు మేకర్స్.

అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా బిజీగా ఉండడంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రవర్తన తో విసుకు చెందిన పూజ హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది . అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే పూజ హెగ్డే తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఆమె కెరియర్ కి మైనస్ గా మారింది. ఇదే విషయంలో ఫీలవుతుందట పూజా. బుద్ధి లేక వదులుకున్నాను అని ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొని బాధపడుతుందట. ఏది ఏమైనా సరే పూజా హెగ్డే మరో మూడు నెలలు హిట్ కొట్టకపోతే ఆమె పేరుని ఇండస్ట్రీలో జనాలు మరిచిపోయే లా చేసే హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీలీల పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news