Moviesవావ్: కాంతార మరో అరుదైన రికార్డ్.. కే జీ ఎఫ్ చరిత్ర...

వావ్: కాంతార మరో అరుదైన రికార్డ్.. కే జీ ఎఫ్ చరిత్ర తుక్కు తుక్కు చేసిందిగా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది. అదే కన్నడ సినిమా కాంతారా. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా కోట్లాదిమంది ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంటుంది . మరి ముఖ్యంగా ఈ సినిమా అన్ని భాషల్లో డబ్ చేసి సినిమాలోని నేటివిటీని అందరికీ పరిచయం చేశాడు రిషిబ్ శెట్టి . కాగా ఇప్పటికే ఎన్నో రికార్డును బద్దలు కొట్టిన రిషిబ్ శెట్టి డైరెక్ట్ చేసిన కాంతారా సినిమా రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ సువర్ణ ఛానల్ లో టెలికాస్ట్ అయింది .

అయితే ఈ సినిమాకి ఇప్పటివరకు ఎన్నడూ .. ఏ సినిమా అందుకొని విధంగా ఏకంగా 15.8 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది . సాండ్లూడ్ లో హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న సినిమాగా కాంతారా రికార్డును నెలకొల్పింది. కాగా ఇప్పటివరకు హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ సంపాదించుకున్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గత ఏడాది విడుదలైన కేజీఎఫ్ సినిమా 10.2 టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంది. తెలుగు వర్షన్ లో 9.3 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.

Kantara Box Office Day 7 (Hindi): Rishab Shetty Starrer Has A Fantastic  Trend, Could Well Challenge KGF Chapter 1 [Hindi] Lifetime

అయితే కె జీ ఎఫ్ టిఆర్పి రేటింగ్స్ ను తుక్కుతుక్కు చేస్తూ కాంతారా సినిమా ఏకంగా 15.8 టిఆర్పి రేటింగ్ రికార్డ్ చేయడం సంచలనంగా మారింది . కాగా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 470 కోట్లు కలెక్ట్ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి . ఇది టెలివిజన్ ఇండస్ట్రీలో మరో సరి కొత్త చరిత్ర అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news