Moviesబ్రేకింగ్‌: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది..!!

బ్రేకింగ్‌: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది..!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆవురావురు మంటూ వెయిట్ చేస్తున్నారు. గ‌త రెండు యేళ్ల‌లో వ‌కీల్‌సాబ్‌, భీమ్లానాయ‌క్ సినిమాల‌తో ప‌వ‌న్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించాడు. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్‌లే. అయినా ప‌వ‌న్ ఛ‌రిష్మాతో ఈ రెండు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టెక్కేశాయి. రెండు సినిమాల‌ను రాజ‌కీయంగా టార్గెట్ చేసినా కూడా ప‌వ‌న్ అభిమానులు, సినీ అభిమానులు క‌సితో చూసి హిట్ చేశారు.

ఇక ఇప్పుడు ప‌వ‌న్ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి తోడు వ‌చ్చే యేడాదే ఏపీలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ప‌వ‌న్ సినిమాలు చేయాలి. ప‌వ‌న్ నుంచి ముందుగా వ‌చ్చే సినిమా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. శ్రీ సూర్యా మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం. ర‌త్నం నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఆమెది సినిమాలో రాకుమారి పాత్ర అంటున్నారు. ఇక ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా మే నెల‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏం వ‌స్తుందా ? అని ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్‌కు ఓ పండ‌గ లాంటి న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ నెల 26నే రిప‌బ్లిక్ డే కానుక‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చేస్తోంది. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే అప్‌డేట్ వ‌చ్చేయ‌నుంది. ఈ సినిమా నుంచి ఎప్పుడు ఏం వ‌స్తుందా ? సంబ‌రాలు చేసుకుందాం అని రెడీగా ఉన్న ప‌వ‌న్ అభిమానుల‌కు ఇది పెద్ద పండ‌గే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news