Moviesవీర సింహా రెడ్డి లో వరలక్ష్మీ పాత్రకు ముందు అనుకున్న హీరోయిన్...

వీర సింహా రెడ్డి లో వరలక్ష్మీ పాత్రకు ముందు అనుకున్న హీరోయిన్ ఈమె.. ఆ సీన్ నచ్చకపోవడంతో రిజెక్టెడ్..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య హీరోగా అందాల ముద్దుగుమ్మ స్టార్ డాటర్ శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సినిమా వీరసింహారెడ్డి. మల్టీ టాలెంటెడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్గా ఎక్కువ థియేటర్స్ లో జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు మొదటి నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా బాలయ్య లోని సరికొత్త మాస్ యాంగిల్ ని బయటపడుతూ గోపీచంద్ మలినేని ఆయనను చూపించిన విధానం నందమూరి ఫ్యాన్స్ కు పిచ్చెక్కించింది .

ఈ సినిమాలో మలయాళ బ్యూటీ హనీ రోజ్ సెకండ్ హీరోయిన్గా నటించింది . స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నెగటివ్షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి నటించింది. సినిమాకి వీర సిమ్హా రెడ్డి పాత్ర ఎంత హైలెట్ అయిందో వరలక్ష్మి శరత్ కుమార్ భాను పాత్ర కూడా అంతే హైలెట్గా నిలిచింది . అన్నను చంపిన చెల్లిగా తన పగలు తీర్చుకున్నాను అనే భ్రమలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన పర్ఫామెన్స్ సినిమా థియేటర్స్ లో విజిల్స్ వేయించింది.

కాగా ఈ కథను రాసుకున్నప్పుడు గోపీచంద్ మల్లినేని మొదట ఈ పాత్ర కోసం అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ను అనుకున్నారట . అప్పటికే భోళా శంకర్ సినిమాలో చెల్లి పాత్రలో కనిపిస్తున్న కీర్తి సురేష్ ..వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు చెల్లిగా నటిస్తే మరింత క్రేజ్ వస్తుందని భావించారట. అంతేకాదు కథను కూడా తీసుకెళ్లి కీర్తి సురేష్ కు వినిపించాడట. అయితే ఆమె స్టోరీ విన్నాక కథ నచ్చిన సైలెంట్ క్యారెక్టర్ లో చెల్లి పాత్రకు నేను సెట్ అవ్వగలను ..కానీ వైల్డ్ గా ఉన్న చెల్లి పాత్రలో నేను సెట్ అవ్వను అంటూ సింపుల్గా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట .

Unstoppable with NBK on AHA: Balakrishna welcomes team Veera Simha Reddy

ఈ క్రమంలోనే ఆ తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ పేరును సజెస్ట్ చేశారట బాలయ్య. ఈ సినిమాలో బాలయ్యతో పోటాపోటీగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా సక్సెస్ కు ప్లస్ పాయింట్ గా నిలిచింది . నాలుగు రోజుల్లోనే 104 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డును క్రియేట్ చేసింది వీరసింహారెడ్డి సినిమా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news