Moviesఆ టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌, స్టార్ స్టోరీ రైట‌ర్ ప‌క్క‌లోకి వెళితేనే...

ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌, స్టార్ స్టోరీ రైట‌ర్ ప‌క్క‌లోకి వెళితేనే హీరోయిన్ల‌కు ఛాన్స్ వ‌స్తుందా..?

సినిమా అంటే కమిట్‌మెంట్. ఈ పదానికి చాలా అర్థాలున్నాయి. ముఖ్యంగా కమిట్‌మెంట్ అంటే హీరోగానీ, హీరోయిన్‌గానీ సినిమా ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇచ్చిన డేట్స్ ప్రకారం అనుకున్న సమయానికి పని పూర్తి చేయాలి. కేవలం హీరో, హీరోయిన్స్ విషయంలో మాత్రమే కాదు..26 శాఖలకీ చెందిన ప్రతీ ఒక్కరికీ ఇదే రూల్ వర్తిస్తుంది. కానీ, ఒక్క హీరోయిన్ విషయంలో ఇదే కమిట్‌మెంట్ పదానికి ఇంకో అర్థం కూడా ఉంది.

ఆ పదం గతంలో ఎక్కువగా బాలీవుడ్‌లో వినిపించేది. కానీ, గతకొన్ని ఏళ్ళ నుంచి మన టాలీవుడ్, కోలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలో కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడ కమిట్‌మెంట్ అంటే సినిమా ఒప్పందం చేసుకునే ముందే మేకర్స్‌తో సన్నిహితంగా ఉండాలని మాట్లాడుకుంటారు. కొందరు దీని అధికారికంగా అగ్రిమెంట్‌లోనూ జత చేస్తారు. మరికొందరు మాత్రం పరస్పర అంగీకారంతో ఒప్పందం చేసుకుంటారు. ఇక్కడ కమిట్మెంట్ అనే పదాన్ని ఇటీవల కొందరు స్టైలిష్‌గా కాస్టింగ్ కౌచ్ అంటూ చెబుతున్నారు.

మేమూ దీనికి బలైపోయామని వాపోతున్నారు. పైన చెప్పుకున్నట్టుగా ఇది దర్శకుడు-నటిల మధ్య లేదా నిర్మాత-నటిల మధ్య పరస్పర అంగీకారంతోనే జరుగుతుంది. కానీ, కొందరు నటీమణులు అవకాశం ఇస్తామని మమ్మల్ని వాడుకొని వదిలేశామని రోడ్డెక్కుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం శ్రీరెడ్డి. నిజంగా ఆమెను చూస్తే జాలి పడాల్సిందే. అంత నమ్మకంగా న దగ్గర ఆధారాలున్నాయి అన్నారంటే ఎంతమంది ప్రబుద్ధులు వాడుకున్నారో చెప్పక్కర్లేదు.

అంతకముందు మాధవీలత కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నానని చెప్పారు. బోయ సునీత విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ప్రముఖ నిర్మాత విషయం లేవనెత్తి ఆఫీస్ ముందు కూర్చున్న సంగతి ఎంత వైరల్ అయిందో తెలిసిందే. మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో భారీ హిట్స్ తీస్న ఓ దర్శకుడు కూడా నటీమణులను కమిట్‌మెంట్ అడుగుతున్నాడని ఇండస్ట్రీలో టాక్. అంజలి, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్‌తో సినిమాలు తీసిన ప్రముఖ రచయిత, నిర్మాతది కూడా ఇదే పని అంటారు. ఇలాంటి వారు మన సౌత్‌లో చాలామందే ఉన్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news