Movies' వీర‌సింహారెడ్డి ' ప్రి రిలీజ్ బిజినెస్‌... బాల‌య్య చ‌రిత్ర‌లో స‌రికొత్త...

‘ వీర‌సింహారెడ్డి ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… బాల‌య్య చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డ్‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది బాలయ్య అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. అఖండ లాంటి కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య రేంజ్ ఎలా ?పెరిగిపోయిందో చూస్తూనే ఉన్నాం. పైగా వీరసింహారెడ్డి సినిమాకు గట్టి పోటీ ఉంది. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాతగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి.

దీనికి తోడు మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తెగింపు సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. వారసుడు – వీరయ్య లాంటి సినిమాల పోటీని తట్టుకుని వీర సింహారెడ్డి బాక్సాఫీస్ యుద్ధంలో ఎలా ? విజేత‌గా నిలుస్తారు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా నిలుస్తోంది. అయితే సినిమాపై ప్రి రిలీజ్ బ‌జ్‌ మాత్రం అదిరిపోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన జై బాలయ్య సాంగ్ – సుగుణసుందరి సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి.

ఈ రెండు సాంగులు చూసిన వారందరూ సినిమా ఖచ్చితంగా మరో లెవల్లో ఉంటుందని అంటున్నారు.
అలాగే స్టిల్స్ తో పాటు సినిమా టైటిల్.. బాలయ్య మాస్ లుక్స్ ఇవన్నీ ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశంలో నిలబెట్టేసాయి. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన స్టిల్ – సాంగ్స్ అన్నీ కూడా ఏ మాత్రం నిరాశపరచలేదని చెప్పాలి. ఎలివేషన్ల విషయంలో కూడా దర్శకుడు మలినేని గోపీచంద్ ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు.

ఇక వీర సింహారెడ్డి సినిమాకు రికార్డు స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా వీర‌ సింహారెడ్డి రికార్డులకు ఎక్కనుంది. ఈ సినిమా కోసం బాలయ్య రు. 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. బాలయ్య – శృతిహాసన్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. ఇక ట్రేడ్ వర్గాల సర్కిల్స్ లో నడుస్తున్న ప్రచారం ప్రకారం వీరసింహారెడ్డికి వరల్డ్ వైడ్ గా రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

బాలయ్య అఖండ సినిమాకు రు. 60 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఆ సినిమా వరల్డ్ వైడ్గా రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించి రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది. మరి ఇప్పుడు ఆ సినిమాతో పోలిస్తే వీర సింహారెడ్డి బిజినెస్ చాలా ఎక్కువగా జరిగినట్టే..! మరి బాలయ్య గట్టి పోటీలో ఈ బిగ్ టార్గెట్ ను ఎలా చేధిస్తాడో చూడాలి. ఏదేమైనా ప్రి రిలీజ్ బిజినెస్ అయితే వీర సింహారెడ్డికి చాలా పాజిటివ్ గా ఉందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news