Moviesప‌వ‌న్‌కు అమీషాకు ఎక్క‌డ చెడింది... ' ఖుషి ' సినిమా టైటిల్...

ప‌వ‌న్‌కు అమీషాకు ఎక్క‌డ చెడింది… ‘ ఖుషి ‘ సినిమా టైటిల్ ఎందుకు మారింది…!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలిజ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఖుషి సినిమాను కూడా ఈ నెల 31న రీ రిలీజ్ చేస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో తొలిప్రేమ త‌ర్వాత ఆ రేంజ్ క‌ల్ట్ మూవీగా నిలిచిన ఖుషి సినిమాపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హంగామా న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌తో పాటు ఏపీ, తెలంగాణ‌లో భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు న‌డుస్తున్నాయి.

అయితే ఈ సినిమా గురించి కొన్ని ఇంట్ర‌స్టింగ్ సంగ‌తులు ఉన్నాయి. ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ భూమిక కాదు. అమీషా ప‌టేల్‌. ఆమె అంత‌కు ముందే ప‌వ‌న్‌కు జోడీగా బ‌ద్రి సినిమాలో న‌టించింది. ఆ సినిమా హిట్ కావ‌డంతో ప‌వనే స్వ‌యంగా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ అమీషాను ఖుషిలో హీరోయిన్‌గా రిక‌మెండ్ చేశారు.

శ్రీ సూర్య మూవీస్ బ్యాన‌ర్ పై అప్ప‌ట్లో వ‌రుస బ్లాక్బ‌స్ట‌ర్ నిర్మాత ఏఎం. ర‌త్నం ఈ సినిమాను నిర్మించారు. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్‌జె. సూర్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఖుషి సినిమాకు ముందు అనుకున్న పేరు చెప్పాల‌ని ఉంది. ఇదే పేరుతో క్లాప్ బోర్డ్ కొట్టారు. అమీషా ప‌టేల్‌నే హీరోయిన్‌గా అనుకుని ఆమెతోనే ఫ‌స్ట్ సీన్ తీశారు. ముందుగా న‌డుము సీన్ తీశాడు సూర్య‌.

ఆ షాట్ చూసి అక్క‌డే ఉన్న అప్ప‌టి హోం మంత్రి దేవేంద‌ర్ గౌడ్‌తో పాటు హీరో వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తండ్రి వెంక‌ట్రావు చ‌ప్ప‌ట్లు కొట్టి అదిరిపోయింద‌ని ప్ర‌శంసించారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌కు, అమీషాకు మ‌ధ్య షూటింగ్‌లో ఏదో గ్యాప్ వ‌చ్చింది. ప‌వ‌న్ కాంప్ర‌మైజ్ కాలేదు. ఆమెను త‌ప్పించే వ‌ర‌కు వ‌చ్చేసింది. చివ‌ర‌కు అప్ప‌టికే సుమంత్ స‌ర‌స‌న యువ‌కుడు సినిమాలో న‌టించిన భూమిక‌ను హీరోయిన్‌గా తీసుకుని అమీషాను త‌ప్పించేశారు.

Watch Kushi | Prime Video

ఇక టైటిల్ కూడా మారిపోయింది. చెప్పాల‌ని ఉంది ప్లేసులో ఖుషి అని పెట్టారు. ఈ టైటిల్ మార్చింది కూడా ప‌వ‌నే. ఇక సినిమాలో కొన్ని సీన్ల‌తో పాటు యాక్ష‌న్ సీన్లు సైతం స్వ‌యంగా ప‌వ‌నే కంపోజ్ చేసుకున్నారు. చివ‌ర‌కు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news