Moviesగుడ్ న్యూస్ చెప్పిన శివ జ్యోతి..ఉబ్బితబ్బిపోతున్న అభిమానులు..!!

గుడ్ న్యూస్ చెప్పిన శివ జ్యోతి..ఉబ్బితబ్బిపోతున్న అభిమానులు..!!

శివ జ్యోతి.. ఇలా చెప్తే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు . అదే తీన్మార్ సావిత్రి అంతే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన ఒరిజినల్ నేమ్ కన్నా షోలో చేసే యాంకర్ నేమ్ తోనే పాపులారిటీ సంపాదించుకుంది శివజ్యోతి . నాగంపేట గ్రామం నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ కి వచ్చి తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేసి తీన్మార్ ప్రోగ్రాం లో ప్రత్యేక గుర్తింపు పొందిన శివ జ్యోతి ..బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది .

అక్కడ కూడా జెన్యూన్ గా గేమ్ ఆడి జనాల మదిని దోచేసింది . మరి ముఖ్యంగా మాటకు ముందు ఎమోషనల్ అయిపోతూ ఉండడం ..బిగ్ బాస్ లో తన తోటి కంటెస్టెంట్ అలీ కు మరింత దగ్గర అవ్వడం ఒక బ్రదర్ల ఫీల్ అవ్వడం అప్పటి జనాలకు బాగా ఎక్కింది. ఈ క్రమంలోనే పాజిటివ్ నేచర్ అంటూ ట్యాగ్ వేయించుకుంది శివ జ్యోతి . బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని .. పలు ప్రోగ్రాం లు చేస్తూ.. పలు ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ రెండు చేతులా బాగా సంపాదిస్తుంది . అంతేకాదు రీసెంట్ గా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది.


శివ జ్యోతి ఇల్లు కట్టుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ఒక ఇంటిని కొనుగోలు చేసే బిఎండబ్ల్యూ కార్ తో అభిమానులకు సర్ ప్రైజ్ చేసిన శివ జ్యోతి .. రీసెంట్గా మరో ఇంటిని కూడా నిర్మించి దాని తాలూకా పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . అంతేకాదు గృహప్రవేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . శివ జ్యోతి ఇంటికి తన ఫ్రెండ్స్ తో పాటు బిగ్ బాస్ స్టార్స్ ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ హాజరై ఆమె సంతోషంలో భాగమయ్యారు . ప్రజెంట్ శివ జ్యోతి గృహప్రవేశం వీడియో సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news