Moviesబాల‌య్య భార్య వ‌సుంధ‌రది గోల్డెన్‌హ్యాండా... ఈ సెంటిమెంట్ వెన‌క హిస్ట‌రీ ఇదే..!

బాల‌య్య భార్య వ‌సుంధ‌రది గోల్డెన్‌హ్యాండా… ఈ సెంటిమెంట్ వెన‌క హిస్ట‌రీ ఇదే..!

విశ్వవిఖ్యాత నటసౌర్వ‌భౌమ ఎన్టీఆర్ ఐదో వారసుడుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. తన కెరీర్లో ఇప్పటివరకు 106 సినిమాలలో నటించిన బాలకృష్ణ… చివరగా గత ఏడాది డిసెంబర్లో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ గర్జన మోగించాడు. ప్రస్తుతం నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ 40 సంవత్సరాలలో మనం ఎప్పుడూ చూడని కొత్త బాల‌య్య‌ను ఇటీవల కాలంలో చూస్తున్నాం. అన్‌స్టాప‌బుల్ టాక్ షో చేస్తున్న బాలయ్యకు లక్షల మంది అభిమానులు కొత్తగా వచ్చి చేరుతున్నారు.

అసలు ఈ తరం జనరేషన్ కూడా బాలయ్య ఆటిట్యూడ్ కు పిచ్చపిచ్చగా కనెక్ట్ అయిపోయి కేరింతలు కొడుతోంది. ఇక బాలయ్య వ్యక్తిగత జీవితం గురించి ప్రపంచానికి తెలియచెప్పేందుకు ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు.. ధార్మిక కార్యక్రమాలు బయటకు చెప్పుకునేందుకు బాలయ్యకు ఎంత మాత్రం ఇష్టం ఉండ‌దు. బాలయ్య భార్య వసుంధర ముందు నుంచి గృహిణిగా మాత్రమే ఉంటారు. ఆమె పెద్దగా బయట కనిపించరు.

బయట సినిమా ఫంక్షన్లు.. ఇతర కార్యక్రమాలలో స్టార్ హీరోల భార్యలు సైతం భర్తతో కలిసి వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వసుంధరా దేవి మాత్రం ఎప్పుడు ఇంటికే పరిమితమవుతుంది. ఆమెకు బాలయ్య సినిమా వ్యవహారాలు అస్సలు పట్టవు. అయితే హిందూపురంలో 2019 ఎన్నికల్లో మాత్రం వసుంధర బాలయ్య తరపున ప్రచారం చేయడంతో పాటు అక్కడ తెరవెనక వ్యూహాలు చ‌క్కపెట్టారు.

బాలయ్య రెండోసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధించటం వెనక వసుంధర పాత్ర కూడా కొంతవరకు ఉందన్నది నిజం. వసుంధర కన్నవారి ఇల్లు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. ఆమె దేవరపల్లి వారి ఆడపడుచు. శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధినేత ఎస్ఆర్ఎంటి చౌదరి గారి సోదరుడి కుమార్తె వసుంధర.

అయితే వ‌సుంధ‌రది గోల్డెన్ హ్యాండ్‌. ఆమె చేత్తో డ‌బ్బులు ఇస్తే ఎవ్వ‌రికి అయినా బాగా క‌లిసొస్తుంద‌న్న ఓ సెంటిమెంట్ ఉంది. బాల‌య్య‌తో సినిమా తీసే నిర్మాతలు ముందుగా వ‌సుంధ‌ర ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆమె చేత్తో ఓ ల‌క్ష రూపాయ‌లు తీసుకుంటార‌ట‌. ఆమె చేత్తో డ‌బ్బులు ఇస్తే చాలా మందికి క‌లిసి వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. అందుకే ఆమెది గోల్డెన్ హ్యాండ్ అంటారు. బాల‌య్య కూడా రోజూ బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఆమె ఎదురు వ‌చ్చాకే బ‌య‌ట‌కు వ‌స్తార‌ట‌. అది వ‌సుంధ‌ర గోల్డెన్ సెంటిమెంట్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news