Moviesహ్యాట్సాఫ్ స్వీటీ .."కాంతారా" భూతకోలా వేడుకల్లో అనుష్క చేసిన పనికి ఫ్యాన్స్...

హ్యాట్సాఫ్ స్వీటీ ..”కాంతారా” భూతకోలా వేడుకల్లో అనుష్క చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే.. కొందరు హీరోయిన్స్ ని అభిమానులు తమ సొంత ఇంట్లోనే మనుషులుగా భావిస్తూ ఉంటారు . కేవలం తెరపై నటించేసి ప్యాకప్ చెప్పుకొని రెమ్యూనరేషన్ తీసుకొని వెళ్ళిపోయే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు . కానీ సినిమాలో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని ప్రజల మనసు దోచుకున్న ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది ఉన్నారు . వాళ్ళల్లో ఒక్కరే ఈ అందాల ముద్దుగుమ్మ స్వీటీ . అదేనండి అనుష్క శెట్టి .

సూపర్ అనే సినిమాతో సినీతెరకు పరిచయమైన అనుష్క శెట్టి ..ఆ తర్వాత ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . తీసిన ప్రతి సినిమా హిట్ కొట్టిందని చెప్పలేము కానీ ప్రతి సినిమాలో తన నటనను ఇంప్రూవ్ చేసుకుంది అని మాత్రం చెప్పగలం.. అంతలా సూపర్ సినిమాకి ఆమె లాస్ట్ గా నటించిన నిశ్శబ్దం సినిమాకి ఇంప్రూవ్ అయింది . కాగా రీసెంట్గా నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాకి కమిట్ అయిన స్వీటీ ..ప్రజెంట్ ఆమె ఫ్యామిలీతో కలిసి తన సొంత ఊరు మంగళూరులోని భూతకోలా వేడుకులకు అటెండ్ అయ్యింది.

మనకు తెలిసిందే కాంతారా సినిమాలో ఈ భూతకోలా వేడుకలను రిషిబ్ శెట్టి కళ్ళకు కట్టినట్లు చూపించాడు . అప్పటివరకు చాలా తక్కువ మందికే తెలిసిన ఈ భూతకోలా వేడుకలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు . కాగా రీసెంట్గా మంగళూరులో భూతకోలా వేడుకలకు హాజరైన అనుష్క ..చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి అభిమానులను ఆకట్టుకుంది . అంతేకాదు అక్కడ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఆ నృత్యాలను తన ఫోన్లో బంధించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే తన సొంత కల్చర్ ని తక్కువ చేయకూడదు అని సొంత కల్చర్ ని ఫాలో అవ్వాలని అనుష్క శెట్టి అందరికీ తెలిసేలా చేసింది. దీంతో అనుష్క శెట్టి కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు ఆమె అభిమానులు . ప్రజెంట్ దీనికి సంబంధించిన పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news