Moviesకేక పెట్టిస్తున్న త్రిష బోల్డ్ నిర్ణయం..ఆ హీరో కోసం అంత రిస్క్...

కేక పెట్టిస్తున్న త్రిష బోల్డ్ నిర్ణయం..ఆ హీరో కోసం అంత రిస్క్ చేస్తుందా..?

ఓ మై గాడ్.. అందాల ముద్దుగుమ్మ త్రిష అలాంటి రోల్ ని యాక్సెప్ట్ చేస్తుందా..? నిజంగా ఇది సాహసం అనే చెప్పాలి. త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు . తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి “నీ మనసు నాకు తెలుసు “అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ..మొదటి సినిమాతోని మోడ్రెన్ లుక్స్ తో ఆకట్టుకుంది . అంతేకాదు సైలెంట్ క్యారెక్టర్ అయినా సరే కళ్ళతోనే హావ భావాలను పలికించి అట్రాక్ట్ చేసింది. ఇక ఆ తరువాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఈ సినిమా హిట్ తో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి కళ్ళు త్రిషపై పడ్డాయి . ఇక తర్వాత త్రిష కెరియర్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు తెలిసిందే . టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దుమ్ము దులిపేసింది. స్టార్ హీరోలు సైతం త్రిష కాల్ షీట్స్ కోసం ఎదురు చూశారంటే ..ఆమె ఏ రేంజ్ లో నటించిందో ఊహించుకోవచ్చు. కాకపోతే వ్యక్తిగత కారణాల కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమైన త్రిష.. రీసెంట్ గా పోనియన్ సెల్వన్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .

ఈ క్రమంలోనే మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్న త్రిష ఖాతాలో ..మంచి మంచి సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే విజయ్ తళపతితో ఓ సినిమాకి కమిట్ అయిన త్రిష ..తెలుగులోను రెండు సినిమాలను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది . కాగా రీసెంట్ గా త్రిష ఓ వ్యభిచారి పాత్రకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . గ్లామరస్ ట్రీట్ అందించే త్రిష ఇలా వ్యభిచారి రోల్ కి సైన్ చేయడం నిజంగా బిగ్గెస్ట్ రిస్క్ అంటున్నారు కోలీవుడ్ జనాలు.

కానీ ఆమె ఈ సినిమా సైన్ చేసింది తన ఫేవరెట్ హీరో కోసం అని ఓ న్యూస్ వైరల్ గా మారింది . కమలహాసన్ సరసన త్రిష ఓ సినిమాలో నటించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఆ హీరో తో సినిమాలో నటించాలని త్రిష ఇలా వ్యభిచారి పాత్రకు సైన్ చేసిందట . అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన గంగుబాయ్ కత్తియవాడి సినిమా ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష ఇలాంటి రోల్ చేయడం బిగ్గెస్ట్ రిస్క్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news