Moviesమహేశ్ బాబు కెరీర్ మొత్తానికి..మేకప్ లేకుండా చేసిన ఏకైక సినిమా...

మహేశ్ బాబు కెరీర్ మొత్తానికి..మేకప్ లేకుండా చేసిన ఏకైక సినిమా ఇదే..సో స్పెషల్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ఇద్దరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా సర్కారీ వారి పాట సినిమాతో క్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా అయిపోగానే రాజమౌళితో ప్రతిష్టాత్మకమైన సినిమాని తీయ్యడానికి రెడీ గా ఉన్నాడు.

అయితే ఇలాంటి క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ బాబు ఇన్నాళ్ల తన కెరీర్ లో ఎన్నో హిట్లు ఫ్లాప్ లు రుచి చూశాడు . అయితే మహేష్ బాబు ఇప్పటివరకు మేకప్ లేకుండా చేసిన ఒకే ఒక్క సినిమా “నిజం”. మహేష్ బాబు ఈ సినిమాలో నేచురల్ లుక్స్ కోసం మేకప్ అస్సలు టచ్ చేయలేదట. అందుకే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి .

మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో అమ్మ చెప్పిన మాట వినే కొడుకు గా నటించి.. సూపర్ గా తన ఫ్యాన్స్ ను అలరించాడు. నిజం కోసం నిజాయితీగా పోరాడిన ఓ కుర్రాడిగా మహేష్ బాబు అందరి మనసులను దోచుకున్నాడు మహేష్ బాబు . ఈ సినిమా మహేశ్ అభిమానులకు చాలా బాగా నచ్చింది. కమర్షియల్ హిట్ అవ్వనప్పటికి..ఫ్యాన్స్ ను మెప్పించింది. ఏది ఏమైనా సరే మహేష్ బాబు మేకప్ వేసుకున్న మేకప్ వేసుకోకపోయినా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అంటున్నారు ఫాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news