Moviesప్రభాస్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..షాకుల మీద షాకులు..!!

ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..షాకుల మీద షాకులు..!!

రెబల్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మరణించి రెబెల్ ఫ్యామిలీకి పెద్దదిక్కు కోల్పోయారని బాధగా ఉంటే ..రెబెల్ ఫాన్స్ అందరు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆది పురుష సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పటికే రెబల్ ఫ్యాన్స్ అందరూ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రాలేదంటూ బాధపడుతున్న టైంలో ఇలా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా వాయిదా పడడం బిగ్ షాకింగ్ అనిపించింది.

సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా జూన్ కి వెళ్ళిపోయింది. వీఎఫ్‌ఎక్స్ లో క్వాలిటీ కోసం సినిమాని వాయిదా వేసినట్టు సమాచారం. కాగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ వినిపించబోతున్నాడు అంటూ వైరల్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన మరో భారీ చిత్రం సల్లార్. కోల్డ్ మైనింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా డిసెంబరు కు వాయిదా పడిన్నట్లు తెలుస్తుంది. జూన్ – ఆగస్టుకి మధ్య రెండు నెలలే ఉంటుంది .పాన్ ఇండియా రేంజ్ లో రెండు చిత్రాలు ఒకే హీరో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయితే మార్కెట్ పరంగా దెబ్బ పడుతుందని ఉద్దేశంతోనే వాయిదా వేస్తున్నారట. ఇలా ప్రభాస్ రెండు సినిమాలు వాయిదా పడడం అభిమానులకి మింగుడు పడడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news