Moviesఓ వెలుగు వెలిగి అడ్ర‌స్ లేకుండా పోయిన సినిమా స్టార్స్ భార్య‌లు...

ఓ వెలుగు వెలిగి అడ్ర‌స్ లేకుండా పోయిన సినిమా స్టార్స్ భార్య‌లు వీళ్లే…!

సినీ రంగంలో ఉన్న హీరోలు, హీరోయిన్ల‌కు మాత్ర‌మే కాదు… వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు న‌డుస్తోంది అంతా డిజిట‌ల్ యుగం కావ‌డంతో సినీ సెల‌బ్రిటీల‌తో పాటు వారి భార్య‌లు, పిల్ల‌లు, కుటుంబ స‌భ్యులు కూడా సెల‌బ్రిటీలు అయిపోతున్నారు. వారి గురించి తెలుసుకునేందుకు జ‌నాల‌కు కూడా ఆస‌క్తి ఉండ‌డంతో వారి విష‌యాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఇక సినీ సెల‌బ్రిటీల్లో కొంద‌రు భార్య‌లు.. త‌మ భ‌ర్త‌ల‌తో ఉన్నప్పుడు లైమ్‌లైట్‌లో ఉండ‌డంతో పాటు ఓ వెలుగు వెలిగారు. వారి భ‌ర్త‌లు చ‌నిపోవ‌డం లేదా విడిపోయాక వారు అస్స‌లు అడ్ర‌స్ లేకుండా పోయారు. భ‌ర్త‌ల‌కు దూరం అయ్యాక అస్స‌లు ఎక్క‌డ ఉన్నారో అడ్ర‌స్ గ‌ల్లంతైన కొంద‌రు సినీ సెల‌బ్రిటీల భార్య‌ల గురించి తెలుసుకుందాం.

ఉదయ్ కిరణ్ భార్య విషిత :
ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను వ‌రుస హిట్ల‌తో ఓ ఊపు ఊపేశాడు వ‌ర్థ‌మాన హీరో ఉద‌య్ కిర‌ణ్‌. ఆ టైంలో ఉద‌య్ కిర‌ణ్‌తో చాలా మంది క్రేజీ హీరోయిన్లు కూడా ప్రేమ‌లో ప‌డ్డార‌న్న‌ది నిజం. ఉద‌య్‌ను పెళ్లాడేందుకు ఎంతో మంది అమ్మాయిలు క్యూలో ఉండేవారు. ఎన్నో పెద్దింటి సంబంధాలు ఉద‌య్‌ను వెతుక్కుంటూ వ‌చ్చాయి. చివ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా త‌న పెద్ద కుమార్తె సుస్మిత‌ను ఉద‌య్‌కు ఇస్తాన‌ని చెప్పి ఎంగేజ్మెంట్ కూడా చేశారు.

అయితే ఆ త‌ర్వాత వేవో తేడాలు రావ‌డంతో ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే క్యాన్సిల్ అయ్యింది. ఆ త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ పాతాళంలో ప‌డిపోయింది. చివ‌ర‌కు ఉద‌య్ చాలా సింపుల్‌గా విషిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ను అన్న‌వ‌రంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ల‌య్యాక కూడా ఉద‌య్ కెరీర్ సాఫీగా సాగ‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణం త‌ర్వాత అస‌లు విషిత ఏమైపోయారో కూడా అడ్ర‌స్ లేకుండా పోయింది. అయితే ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్నార‌న్న మాట త‌ప్పా ఆమె గురించి ఎవ్వ‌రికి తెలియ‌కుండా పోయింది.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ చక్రి భార్య శ్రావణి :
ఇండ‌స్ట్రీలో చ‌క్రి త‌క్కువ టైంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎదిగాడు. అయితే చ‌క్రి మితిమీరిపోయిన ఒళ్లు రావ‌డంతో హార్ట్ ఎటాక్‌కు గురై చిన్న వ‌య‌స్సులోనే మృతిచెందాడు. ఇక చ‌క్రి మ‌ర‌ణానికి ముందు అత‌డి భార్య శ్రావ‌ణి చాలా ఫంక్ష‌న్ల‌లో భ‌ర్త‌తో క‌లిసి క‌నిపించేవారు. అయితే చ‌క్రి మృతి త‌ర్వాత భ‌ర్తింటి వాళ్లు త‌న‌ను చాలా ఇబ్బందులు పెట్టార‌ని ఆమె వాపోయింది. అంత‌కు ముందు వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో అయినా అప్పుడ‌ప్పుడు క‌నిపించే శ్రావ‌ణి ఆ త‌ర్వాత ఏమైపోయిందో తెలియ‌కుండా పోయింది.

మంచు మ‌నోజ్ మాజీ భార్య ప్ర‌ణ‌తి రెడ్డి :
మంచు వారి రెండో అబ్బాయి మ‌నోజ్ ప్ర‌ణ‌తి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్ర‌ణ‌తి రెడ్డి ఎవ‌రో కాదు త‌న వ‌దిన వెరోనికా రెడ్డి స్నేహితురాలు. అయితే పెళ్ల‌యిన రెండేళ్ల‌కే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మ‌నోజ్ భూమా మౌనికా రెడ్డితో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌నోజ్‌తో ఉన్న‌ప్పుడు ప్ర‌ణ‌తి రెడ్డి అప్పుడ‌ప్పుడు అయినా వార్త‌ల్లో ఉండేది. ఇప్పుడు విడాకుల త‌ర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఆమె ఏం చేస్తుందో ? కూడా తెలియ‌ట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news