Moviesజబర్ధస్త్ లో ఆ కమెడియన్ మహా కంత్రీ..అందరిని తొక్కేసింది వాడే..మల్లెమాలతో సీక్రేట్...

జబర్ధస్త్ లో ఆ కమెడియన్ మహా కంత్రీ..అందరిని తొక్కేసింది వాడే..మల్లెమాలతో సీక్రేట్ ఒప్పందం..!?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి పేరు సంపాదించుకుందో తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా బుల్లితెరపై ఫస్ట్ టైం ఓ సరికొత్త కామెడీ షోను డిజైన్ చేసి పలువురు టాలెంట్ ఉన్న కమెడియన్స్ ను జనాలకి పరిచయం చేసింది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ . జబర్దస్త్ అనే ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది రోడ్డున పడి ఉన్న టాలెంట్ఉన్న కమెడియన్స్ లైఫ్ లో సెటిల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఒకప్పుడు తిండికి దిక్కులేని కమెడియన్స్ ఇప్పుడు బంగ్లాల్లో ఉంటూ కార్లలో తిరుగుతున్నారు అంటే దానికి ఏకైక కారణం జబర్దస్త్ షో అనే చెప్పాలి. ఈ విషయాన్ని వాళ్ళు డైరెక్ట్ గా నే చెప్పుకొచ్చారు.

అయితే ఎక్కడ ఎదిగే వాళ్ళు ఉంటారో అక్కడ తొక్కేసే వాళ్ళు ఉంటారు అన్నది ఈ షో ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ షోలో మొదట టాలెంట్ కంటెంట్ ను చూస్తూ అవకాశాలు ఇచ్చారు. క్రమీన అది ఎలా మారిందంటే పబ్లిసిటీ ..పాపులారిటీ ..ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్లకి ఆఫర్లు ఇచ్చుకుంటూ రావడం దీంతో జబర్దస్త్ షోలో ఉన్న కొందరు కమెడియన్స్ వాళ్ళ పలుకుబడి ఉపయోగించి ఫ్యామిలీలను సెటిల్ చేసుకోవాలని పిన్నమ్మ కూతుర్లను దూరపు బంధువులను షోలోకి పిలిపించుకోవడం ..ఆ తర్వాత టాలెంట్ ఉన్న కమెడియన్స్ ని తొక్కేయడం ఇలాంటివి చేశారట .

మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో ఒక కమెడియన్ ఎంటర్ అయ్యాకే ఈ షో సర్వనాశనం అయిందని జనాలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ ఆ కంటెస్టెంట్ కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈ జబర్దస్త్ కమెడియన్ మాత్రం అన్ని చానల్స్ లో తిరుగుతూ అన్ని షోలు చేసుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ వెనకేసుకుంటున్నారు. కానీ మిగతా కంటెస్టెంట్లు ఎవరైనా సరే వేరే ఈవెంట్స్ కి వెళ్ళినా ప్రోగ్రామ్స్ కి వెళ్ళినా.. వాళ్లని కావాలని తొక్కేసే విధంగా చూసుకుంటున్నాడట. అంతేకాదు ఈ టాప్ మోస్ట్ జబర్దస్త్ కమెడియన్ మల్లెమాలతో సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకున్నాడని పేమెంట్ కాకుండా మరో విధంగా కూడా ఆయనకు డబ్బులు ముట్ట చెబుతుందని మల్లెమాల..ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏదేమైనా సరే ఈ జబర్దస్త్ కమెడియన్ మహా కంత్రి గాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news