Moviesచెత్త కంటెస్టంట్లను హౌస్ లోకి తీసుకొచ్చావ్.. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది...

చెత్త కంటెస్టంట్లను హౌస్ లోకి తీసుకొచ్చావ్.. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది వరస్ట్ .. శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు ..!!

డైలీ బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఇది షాకింగ్ గానే ఉంటుంది . రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో సోషల్ మీడియా స్టార్ సెలబ్రెటీ గా ఉన్నటువంటి శ్రీహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే తెలుగు తెరపైన అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ప్రస్తుతం ఆరవ సీజన్ కొనసాగుతుంది . ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కి చెప్పుకోదగ్గ హౌస్ మేట్స్ లేరని.. దీంతోనే టీఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

 

అఫ్ కోర్స్ టిఆర్పి రేటింగ్ పెంచడానికి బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త టాస్కులు ఇస్తూ.. నాగార్జున చేత చివాట్లు తిట్టిస్తూ..వీళ్లైనంత విధంగా ట్రై చేస్తున్నా కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా లైట్ గా తీసుకుని తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా ..అనే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో బిగ్ బాస్ ఇంట్లోని హౌస్ మేట్స్ కు కొందరు హీరో హీరోయిన్స్ సినిమాలు గెటప్స్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చేయమన్నారు బిగ్ బాస్.

దీంతో కొంతసేపు సరదాగా సాగిన ఈ టాస్క్ ఆ తర్వాత కంటెస్టెంట్స్ సైలెంట్ అయిపోయి.. ఎవరి సొల్లు కబుర్లు వాళ్ళు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు . దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిపోయిన బిగ్ బాస్.. హౌస్ లోని కంటెస్టెంట్ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి.. మెయిన్ డోర్ ఓపెన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు. ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .

అంతేకాదు ఈవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రద్దు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు . దీంతో ఫైర్ అయిపోయిన శ్రీహాన్..” ఇంట్లో సరైన కంటెస్టెంట్లు లేరు బిగ్ బాస్ బిగ్ .. బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చారు .. తిన్నామా..పడుకున్నామా.. అంతే.. సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వాళ్లకు టైం ఉంటుంది బిగ్బాస్ ఇచ్చిన పనులు చేయడానికి టైం ఉండదు ..కనీసం మీరైనా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి” అంటూ స్టేట్మెంట్ పాస్ చేసారు. దీంతో ఒక్కసారి గా బయట మిగిలిన హౌస్ మేట్స్ సపోర్టర్స్ కి కోపం వచ్చింది. ” హౌస్ లో నువ్వు చేసింది ఏంది? అమ్మాయిలతో పులిహోర కలపడమా..? ముందు నీ పని నువ్వు చూసుకో ..నువ్వు సక్రమంగా గేమ్ ఆడు ..ఆ తర్వాత మిగతా వాళ్ళకి చెబుతూ.. నువ్వు ఏమైన అంత తోపు అనుకుంటున్నావా..? అంటూ ఏకిపారేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news