Moviesమళ్ళీ వివాదంలో సాయిపల్లవి..మహేష్ పై సంచలన వ్యాఖ్యలు..!!

మళ్ళీ వివాదంలో సాయిపల్లవి..మహేష్ పై సంచలన వ్యాఖ్యలు..!!

సాయి పల్లవి ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో నెగెటివిటీ లేని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా సాయి పల్లవి నే. మలర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ..ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు జనాలకు తన అందాన్ని పరిచయం చేసింది. ఫిదా సినిమా హిట్ అవ్వడంతో సాయి పల్లవి పేరు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. మరీ ముఖ్యంగా ఆమె నేచురల్ యాక్టింగ్ డాన్స్ అంటే తెలుగు జనాలు చాలా ఇష్టం.

తెలుగులో ఫిదా సినిమా హిట్ అవడంతో అమ్మడుకు అవకాశాలు క్యూ కట్టాయి. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సాయి పల్లవి వరుస సినిమాలు కమిట్ అవుతూ.. అభిమానులను సంతృప్తిపరిచింది. అయితే ఆమె లాస్ట్ గా నటించిన చిత్రం గార్గి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది . కానీ సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి . ఈ క్రమంలోనే సాయి పల్లవి రీసెంట్గా మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

“నేను స్టార్ హీరోతోనే సినిమా చేయాలి అని అనుకోను.. నా దృష్టిలో హీరో ఇంపార్టెంట్ కాదు ..కథ నచ్చితే ఎవరితో అయినా చేస్తాను.. అది స్టార్ హీరో అని కాదు కమెడియన్ అయినా సరే ఎవరితో అయినా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు “సినిమా ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం .. నేను మాధురి దీక్షిత్ డాన్స్ చూస్తూ స్టెప్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పిన సాయి పల్లవి మహేష్ బాబు స్క్రీన్ ప్రజెంట్ చాలా నచ్చుతుందని ఆయన సింప్లిసిటీ అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అంతేకాదు మహేష్ బాబును చూశాక మగాళ్లు ఇంత అందంగా ఉంటారా అని కూడా నాకు అనిపించిందని చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా సాయి పల్లవి పై కొందరు నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు . ప్రపంచంలో ఆడవాళ్ళు మాత్రమే అందంగా ఉండాలా..? మగాళ్లు అందంగా ఉండకూడదా..? నువ్వు ఏమన్న పెద్ద ఫిగర్ నా..? అంటూ సాయి పల్లవి పేరు మరోసారి నెట్టింట ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news