Moviesప్రభాస్ లైఫ్ లో ఆమె ఓ ఐరెన్ లెగ్.. అందుకే దూరం...

ప్రభాస్ లైఫ్ లో ఆమె ఓ ఐరెన్ లెగ్.. అందుకే దూరం పెట్టాడా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ రెబల్ హీరో ..ఇప్పుడు ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలాగనే చూసుకుంటున్నాడు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కారణం దర్శకధీరుడు డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమానే కారణం . ఎస్ ఈ విషయం ఎవ్వరిని అడిగినా చెప్తారు. ప్రభాస్ కెరియర్ మారిపోవడానికి ఒకే ఒక్క కారణం బాహుబలి . ఈ సినిమాలో కానీ ప్రభాస్ నటించకపోయుంటే ఇంతటి క్రేజీయస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోలేకపోయేవాడు.

కాగా ప్రభాస్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు కానీ ఓ హీరోయిన్ అంటే మాత్రం ప్రభాస్ కి పిచ్చ కోపం వస్తుందట . ఎందుకంటే ఆమెతో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. దీంతో ఇక జన్మలో ఈ హీరోయిన్ తో నటించకూడదు అని ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడట . అంతేకాదు ఆ తర్వాత కొందరు డైరెక్టర్స్ తన సినిమాలో ఆమె పేరుని సజిస్ట్ చేసినా నో అని చెప్పేసి రిజెక్ట్ చేశాడట . ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ ఛార్మి కౌర్.

మనకు తెలిసిందే ఛార్మి ఒకపట్లో సినీ ఇండస్ట్రీని ఏలేసిన బ్యూటీ. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయి.. బడాబడా హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది . కాగా ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది . అయితే కథపరంగా కంటెంట్ లేకపోవడమో లేకపోతే తెరపై వీళ్ల కెమిస్ట్రీ బాగోకపోవడం తెలియదు కానీ.. చేసిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ సినిమా చక్రం . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది . ఆ పక్క సంవత్సరమే వీళ్లిద్దరు కాంబోలో మరో సినిమా వచ్చింది . ఆ సినిమానే పౌర్ణమి . ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఛార్మీ ని ఐరెన్ లెగ్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు . ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆమెతో ఇక నటించకు అంటూ రిక్వెస్ట్ చేసారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాట విన్నారో లేక ఆయనే అర్థం చేసుకున్నారో తెలియదు కానీ అప్పటినుంచి ప్రభాస్ చార్మిని దూరంగా పెడుతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news