Moviesనయనతార చెల్లెల్లు తాన్యా కోట్ల ఆస్తికి వారసురాలు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్...

నయనతార చెల్లెల్లు తాన్యా కోట్ల ఆస్తికి వారసురాలు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అయిపోతారు..!!

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఆ పేరే తాన్యా రవిచంద్రన్ . నిజానికి ఈ పేరు తెలుగు జనాలకు కొత్త పేరు.. కానీ సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు , కోలీవుడ్ జనాలకు ఈ పేరు బాగా సుపరిచితం. తాన్యా రవిచంద్రన్ ఎవరో కాదు.. తమిళ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు. తాత పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తాన్యా మొదటి సినిమాతోనే తనదైన స్టైల్ లో నటించి అభిమానులను మెప్పించింది. తాన్యా రవిచంద్రన్ 2016లో ‘బల్లే వెళ్ళైయితేవా’ అనే తమిళ్ సినిమా ద్వారా సినీరంగం ప్రవేశం చేసింది.

ఇక 2021 లో విడుదలైన “రాజా విక్రమార్క” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే రాజా విక్రమార్క సినిమా తాన్యా రవిచంద్రన్ కు తెలుగులో పెద్ద గుర్తింపు తీసుకురాలేకపోయింది. తెలుగులో అసలు అమ్మడి పేరే గుర్తు పెట్టుకొని జనాలకు తమిళ్ ఫాన్స్ మాత్రం తాన్యా నటనకు ఫిదా అయిపోతారు . తాన్యా రవిచంద్రన్ తమిళ్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది. కాగా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ప్రత్యేకమైన రోల్ లో మెరిసి తాన్యా రవిచంద్రన్ తెలుగులో కూడా తన పేరుకి పాపులారిటీ దక్కించుకునింది.

మోహన్ రాజు డైరెక్షన్లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార లేడీ పొలిటిషన్ గా అదరగొట్టింది . నయనతార చెల్లెలుగా నటించిన అమ్మాయే ఈ తాన్యా . ఇప్పుడు గుర్తు వచ్చిందా..? తాన్యా రవిచంద్రన్ అంటే ఎవరో.. నిజానికి తాన్యా రవిచంద్రన్ చదువులో సూపర్ ..పీజీ చేసింది ఎం ఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ ఆర్ పూర్తి చేసింది. అయినా కానీ సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో తను సినిమా రంగం వైపు అడుగులు వేసింది . అందుతున్న సమాచారం ప్రకారం తాన్యా కోట్ల ఆస్తికి అధిపతురాలు. కానీ సినిమా ఇండస్ట్రీలో తన పేరును స్వతహాగా పాపులర్ చేసుకోవాలని తాన్యా ఆరాటపడుతుంది చాలా సింపుల్ లుక్ లో సాదాసీదాగా కనిపిస్తుంది. అదే ఆమెను జనాలు ఇష్టపడడానికి మెయిన్ రీజన్. మరి చూడాలి గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టిన తాన్యా రవిచంద్రన్ .. తెలుగులో ఎన్ని సినిమాలు అందుకు బోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news