Moviesవిజయ శాంతి చేయాల్సిన మూవీ..లాస్ట్ మినిట్ లో అనుష్క చేసేసింది.. ఆ...

విజయ శాంతి చేయాల్సిన మూవీ..లాస్ట్ మినిట్ లో అనుష్క చేసేసింది.. ఆ సినిమా ఏంటో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అవార్డ్స్ ఎంతో క్రేజీ పాపులారిటీ దక్కించుకున్న విజయశాంతి ..ఇండస్ట్రీని ఏ రేంజ్ లో అల్లాడించేసిందో మనకు తెలిసిందే. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమైంది . ఆ తర్వాత పలు వచ్చిన అవకాశాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రీసెంట్ టైంలో విజయశాంతి కమిట్ అయిన మూవీ కళ్యాణ్ రామ్ చేస్తున్న మూవీ.

2005లో సినీ రంగానికి దూరం అంటూ దాదాపు 15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . కాగా ఆమె కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీలో ఒక ఇంపార్టెంట్ పాత్ర చేస్తుంది . కాగా రీసెంట్ గా విజయశాంతికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. గతంలో విజయశాంతి చేయాల్సిన మూవీని హీరోయిన్ అనుష్క చేసిందట . ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

ఆ సినిమా మరేదో కాదు రుద్రమదేవి . విజయశాంతి దీనిపై మాట్లాడుతూ..” నేను తెలంగాణ బిడ్డను ..సినిమాలో నుంచి రాజకీయాల్లోకి వచ్చాను.. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాను. ఆ సమయంలో రుద్రమదేవి సినిమాతో రీఎంట్రీ ఇద్దామనుకున్నాను . తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మహారాణి రుద్రమదేవి పాత్రలో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ ఆశపడ్డాను. కానీ అదేదో తమాషాగా చేసే సినిమా కాదు ..చాలా చాలా డెడికేషన్ ఉండాలి.. చాలా కష్టపడాలి జనాలకు ముఖ్యంగా ఆ పాత్రలు నచ్చాలి ..అయితే ఆలస్యం అవుతూ స్క్రిప్ట్ మారుస్తూ ఆలోచనలోనే ఉన్నాం ..ఈలోపు తెలంగాణ రావడంతో మళ్లీ సినిమా ఆలస్యమైంది.. ఈలోపు ఆ సినిమా మరొకరు తీసేసారు “అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు . ప్రజెంట్ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news