Moviesహవ్వ..పబ్లిక్ లో స్టార్ హీరో భార్యను అక్కడ టచ్ చేసిన అభిమాని..స్పాట్...

హవ్వ..పబ్లిక్ లో స్టార్ హీరో భార్యను అక్కడ టచ్ చేసిన అభిమాని..స్పాట్ లోనే ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ ఓవర్ చేస్తున్నారు అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోస్ ని హీరోయిన్స్ ని ఇబ్బందులు పెట్టిన అభిమానులు.. ఇప్పుడు హద్దుల మీరి ప్రవర్తిస్తున్నారు. ఫోటోలు , ఆటోగ్రాఫ్ లు అంటూ పై పైకి వస్తూ హీరోయిన్స్ ని తాకరాని చోట తాకుతూ వాళ్ళ ప్రైవేట్ పార్టీని టచ్ చేస్తూ వాళ్లకి ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది , అంతే కాదు దీనిపై పలువులు స్టార్స్ మండిపడుతున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ త్వరలోనే ప్రభాస్ “స్పిరిట్” సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే బాలీవుడ్లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ నెట్టుకొస్తున్న కరీనాకపూర్ తాజాగా కొడుకు జైతో ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడ జనాభా ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.

ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ చేసిన పనికి ఆమె కోపడ్డింది. ఆ ఆకతాయి సెల్ఫీ పేరుతో ఆమె దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేయబోయాడు. దీంతో ఒక్కసారి బాడీగార్డ్ వచ్చి అక్కడ పరిస్థితిని చెక్క దిద్దాడు. దీంతో కరీనాకపూర్ జస్ట్ మిస్ అయింది. లేకపోతే ఆ ఆకతాయి ఏం చేసేవాడో కూడా ఎవరూ ఊహించలేరు. కేవలం కరీనాకపుర్ నే కాదు ఇలా చాలామంది హీరోయిన్స్ పబ్లిక్ లో ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ ఆ ఆకతాయిపై మండిపడుతున్నారు. అంతేకాదు “అమ్మాయిలతో డీసెంట్గా బిహేవ్ చేయండి .. ఇలాంటి పనులు చేయొద్దు ..హద్దులు మీరడం వల్ల మీకే ప్రాబ్లం” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news