Moviesఆ స్టార్ డైరెక్ట‌ర్ కియారాను నిండా ముంచేస్తాడా.... కెరీర్ క్లోజ్ అయిన‌ట్టే...!

ఆ స్టార్ డైరెక్ట‌ర్ కియారాను నిండా ముంచేస్తాడా…. కెరీర్ క్లోజ్ అయిన‌ట్టే…!

క్రియేటివ్ జీనియస్‌గా కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు శంకర్. ఆయన సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా పదేళ్ళ తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ముందే చూపిస్తారు. దీనికి ఉదాహరణ జెంటిల్ మేన్ సినిమా నుంచి రోబో వరకూ చూడవచ్చు. అంతగా ఒక కథను రీ సెర్చ్ చేసి శంకర్ సినిమాను రూపొందిస్తుటారు. అందుకే, ఆయనకి..ఆయన సినిమాలకి ప్రతీ ఒక్కరిలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఒక్కో సినిమాకి ఏళ్ళతరబడి సమయం తీసుకుంటారనే అపవాదు ఉన్నా, అది సినిమా చూసిన తర్వాత మారు మాట్లాడకుండా ఒప్పుకుంటారు. ఆయన నిర్మాతతో పెట్టించే ప్రతీ రూపాయి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేస్తుంది. హీరోను కథకు తగ్గట్టుగా ఎలా మలచుకోవాలో ఏ దర్శకుడైనా ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. రాసుకున్న కథలో ఖచ్చితంగా సామాజిక అంశం మిళితమై ఉంటుంది. దానికి హై టెక్నికల్ వ్యాల్యూస్ కలిపి ఓ విజువల్ వండర్‌లా వెండితెర మీద ఆవిష్కరిస్తారు.

అయితే, హీరోయిన్స్ విషయంలో కూడా ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. శంకర్ సినిమాలో నటించిన తర్వాత.. ఇక, ఆ హీరోయిన్‌కి లైఫ్ ఉండదనే టాక్ బలంగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి ఉదాహరణ శ్రియ శరణ్, సదా, జెనీలియా, ఇలియానా, మనీషా కోయిరాలా.. లాంటి వారినే తీస్కోవచ్చు. ఆయన రిపీట్ చేసిన హీరోయిన్స్ కూడా ఇద్దరే. ఒకరు ఐశ్వర్య రాయ్, ఇంకొకరు మనీషా కోయిరాల. శంకర్ సినిమాలో నటించిన తర్వాత చాలావరకూ బ్రేక్ రాలేదు.

ఇక మిగతా హీరోయిన్స్ అయితే మళ్ళీ కనిపించింది లేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా కొనసాగుతున్న కిరాయా అద్వానీ పరిస్థితి కూడా ఆర్సీ 15 తర్వాత అంతేనా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో ఓ బ్లాక్ బస్టర్, ఓ భారీ డిజాస్టర్‌లో నటించిన కియారా..బాలీవుడ్‌లో మాత్రం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా వెలుగుతోంది. ఎద అందాలు అందరూ ఆశించే, కోరుకునేలా లేకపోయినా గ్లామర్ పాత్రలతో పాటు బోల్డ్ పర్ఫార్మెన్స్‌తోనూ అందరినీ మెస్మరైజ్ చేసింది. అలాంటి క్రేజీ హీరోయిన్ కెరీర్ శంకర్ సినిమా తర్వాత ఏమవుతుందో అని మాట్లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news