Moviesమహేష్ కోసం ఫస్ట్ టైం ఆ పని చేస్తున్న రాజమౌళి.. బాలీవుడ్...

మహేష్ కోసం ఫస్ట్ టైం ఆ పని చేస్తున్న రాజమౌళి.. బాలీవుడ్ షేకింగ్ అప్ డేట్..!?

సూపర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ.. రాజమౌళితో మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్ . అయితే అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ..అంటే సుమారు మూడు నెలల లోపు కంప్లీట్ చేసేసి జనవరి మొదటివారం కానీ జనవరి ఆఖరి వారంలో కానీ రాజమౌళితో నటించబోయే క్రెజియస్ట్ ప్రాజెక్ట్ పనుల్లో భాగమవ్వనున్నాడు అంటూ తెలుస్తుంది.

మనకు తెలిసిందే రాజమౌళి డైరెక్షన్ అంటే మాటలు కాదు . ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాజమౌళి తన సినిమాలో సీన్స్ కానీ యాక్టర్స్ ని కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సినిమా ఖచ్చితంగా అనుకున్న దానిమీద సంవత్సరం షూటింగ్ లేట్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే ..బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎన్ని సంవత్సరాలు తీసుకొని తెరకెక్కించాడు మనం కళ్ళారా చూసిందే.

కాగా మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా సుమారు రెండు సంవత్సరాలు పైనే పడుతుంది అన్న టాక్ వినిపిస్తుంది . ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియా ద్వారా లిక్ అయ్యి ఘట్టమనేని ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది . ఇప్పటివరకు తన సినిమాలో విలన్ గా లేడీస్ ని చూస్ చేసుకోలేదు రాజమౌళి. ఏదో ఒక యుధం ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారే కానీ ..ఏనాడు తన సినిమాలో లేడీ విలన్ ని పెట్టలేదు . కానీ ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ బాబు కోసం బాలీవుడ్ హాట్ విలన్ ని దింపబోతున్నట్టు తెలుస్తుంది.

నాగిని సీరియల్ ద్వారా మౌని రాయి ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే. రీసెంట్గా వచ్చిన బ్రహ్మస్త్ర సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడానికి మౌని రాయి నటన ప్రధాన కారణమని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మౌని రాయ్ నటించిన తీరు జనాలను మెప్పించింది .అంతేకాదు ఆమె నటన చూసి రాజమౌళి కూడా ఫిదా అయిపోయారట. ఈ కారణంగానే రాజమౌళి మహేష్ బాబు సినిమాలో మౌని రాయ్ ని.. విలన్ గా పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే ఫస్ట్ టైం మహేష్ బాబు కూడా ఓ లేడీ విలన్ తో పోరాడబోతున్నాడు అనే చెప్పాలి . మరి చూడాలి తెరపై మహేష్ బాబు – రాజమౌళి కాంబో ఏమేరా వర్క్ అవుట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news