Moviesఅభిమానులకు షాకింగ్ న్యూస్..తల్లి కాబోతున్న బింధు మాధవి ..!?

అభిమానులకు షాకింగ్ న్యూస్..తల్లి కాబోతున్న బింధు మాధవి ..!?

బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు తెలుగు అమ్మాయి నే అయినా.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అమ్మడుకు అవకాశాలు ఇవ్వలేదు దర్శక నిర్మాతలు. ఇచ్చిన అరాకొరా చాన్సుల్లో బిందు మాధవి తనను నటిగా మెప్పించుకోలేకపోయింది. ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తెలుగులో ఆమెకు అవకాశాలు జీరో అయ్యాయి. అయితే తనలో టాలెంట్ ఉంది అంటూ ప్రూవ్ చేసుకోవడానికి కోలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి మంచి మంచి అవకాశాలు పట్టి అక్కడ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది.

అయితే కోలీవుడ్ లో వచ్చిన పాపులారిటీతో తెలుగులో బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయింది . ఆల్రెడీ కోలీవుడ్ లో కూడా బిగ్ బాస్ సీజన్ కి వెళ్లి ఫైనల్ వరకు చేరుకోలేకపోయింది . కాగా తెలుగులో మాత్రం బిగ్ బాస్ ఓటిటి ద్వారా అభిమానులకు మరింత దగ్గరై ఏకంగా ట్రోఫీ అందుకున్నింది. అంతేనా బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి అమ్మాయి ట్రోఫీ అందుకున్న ఘనత సాధించింది.
అయితే బిగ్ బాస్ తర్వాత బింధు మాధవికి అవకాశాలు క్యూ కాడతాయని అంతా భావించారు , అమ్మడు హౌస్ లో ఉన్నప్పుడే బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలో ఓ కీలకపాత్రలో నటించబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

సీన్ కట్ చేస్తే బయటకు వచ్చాక అమ్మడు లో అంత సీన్ లేదని తెలిసిపోయింది. ఇప్పటివరకు బిందు మాధవి ఒక్కటంటే ఒక్కటి సినిమాకి కూడా సైన్ చేయలెదౌ. ఇక పై చేస్తుందన్న నమ్మకాలు జనాల్లో లేవు. అయితే రీసెంట్గా కోలీవుడ్లో అమ్మడుకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ సినిమాలో బిందు మాధవి ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతుందట. అయితే ఈ సినిమాలో బిందు మాధవి లేడీ ఓరియంటెడ్ రోల్ లో కనిపించబోతుంది. ఓ తల్లి బిడ్డ కోసం పడే తాపత్రయం ఎలా ఉంటుందో.. ఒక బిడ్డని చేజార్చుకుంటే ఎలా ఉంటుందో..? దానికి కారకులైన వారిని కోర్టుకు లాగి న్యాయం చేసుకుంటుందా..? లేదా..? అన్న పాయింట్ లైన్ లో బిందు మాధవి నటించబోతుందట. ఇందులో బిందు మాధవి 12 ఏళ్ల పాపకు తల్లిగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి బిందు మాధవి ఫిగర్ కి ఇలాంటి రోల్ సూట్ అవ్వదు. అయినా కానీ అమ్మడు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే దానిలో ఏదో పెద్ద కారణమే ఉంది అంటున్నారు జనాలు. దీంతో ఆమె తీసుకున్న నిర్ణయాఇకి అభిమానులు షాక్ అయిపోతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news