Moviesబిగ్ షాకింగ్: అనుష్క సినిమా ఆగిపోయింది..బెల్లంకొండ అబ్బాయి భలే దెబ్బేసాడుగా..!?

బిగ్ షాకింగ్: అనుష్క సినిమా ఆగిపోయింది..బెల్లంకొండ అబ్బాయి భలే దెబ్బేసాడుగా..!?

అయ్యయ్యో పాపం తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ ఇప్పుడు బెల్లంకొండ గణేష్ చేసిన పనికి అనుష్క సినిమా ఆగిపోయినంత పరిస్థితి వచ్చిందట . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ అంటే గుర్తొచ్చేది అనుష్క, నయనతారనే. ఇద్దరు అలాంటి పేరును సంపాదించుకున్నారు. సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క ఆ తర్వాత ప్రతి సినిమాను సూపర్ హిట్ అయ్యేలా నటించింది.

కాగా కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలేసిన అనుష్క ..ప్రజెంట్ నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్పెర్మ్ డోనార్ గా కనిపించనున్నాడు అని ఇదివరకే ఓ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అతడు అనుష్కను ప్రేమిస్తాడని.. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు తెర పై సూపర్ గా ఉంటాయని ఒక క్రేజీ న్యూస్ సినీవర్గాలలో కొన్ని నెలలుగా హల్చల్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క-నవీన్ పోలిశెట్టి సినిమా షూటింగు కు బ్రేక్ పడిందట . దానికి పరోక్ష కారణం బెల్లంకొండ గణేష్.

ఈ హీరో డెబ్యూ గా వచ్చిన సినిమా స్వాతిముత్యం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 5 న థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది . ఫస్ట్ సినిమాతోనే ఇలాంటి పాజిటివ్ టాక్ దక్కించుకోవడం శుభ పరిణామం అంటూ బెల్లంకొండ హీరోని తెగ పొగడేస్తున్నారు జనాలు . అయితే ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ స్పెర్మ్ డోనార్ గా కనిపిస్తాడు. ఇంచుమించు స్వాతిముత్యం కథలానే ఉంటుందట నవీన్ పోలిశెట్టి-అనుష్క నటించబోయే సినిమా . సేమ్ అదే దుబాయ్ కనెక్షన్ కీలకంగా మారిపోతుందట. దీంతో ఇదే కాన్సెప్ట్ తో మళ్ళీ సినిమా వస్తే జనాలకు నచ్చదని సినిమాలో భారీ చేంజెస్ చేయడానికి ఈ సినిమా షూటింగ్ ను కొన్నాళ్లు వాయిదా వేశారని సినీ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది . దీంతో మొదటి సినిమాతోనే అనుష్కకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు బెల్లంకొండ గణేష్ అంటూ క్రేజీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news